AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్

IND vs NZ: భారత క్రికెట్ జట్టు అలాగే న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ ఐదో అలాగే చివరి మ్యాచ్ జరగనుంది. హ్యామిల్టన్ వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించిన టీమిండియా 3-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

IND vs NZ: టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్
Ind Vs Nz
Rakesh
|

Updated on: Nov 01, 2026 | 12:20 PM

Share

IND vs NZ:  భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదో టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. హామిల్టన్‌లోని సెడన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ చివరి పోరులో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. దీంతో ఇండియా బ్యాటింగుకు దిగనుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్.. చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి 4-1తో సిరీస్‌ను ముగించాలని చూస్తోంది. మరోవైపు నాలుగో టీ20లో 87 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

వైభవ్‌కు మరో అవకాశం?

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. అతడిని తిరిగి తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే సంజూ శాంసన్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.  ఈ సిరీస్‌లో సంజూ తొలి మ్యాచ్‌లో 67 పరుగులు చేశాడు. ఆ తర్వాత వరుసగా 14, 18, 4 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు వైభవ్ రెండో, మూడో టీ20ల్లో ఆడాడు. ఇషాన్ కిషన్ అందుబాటులోకి రావడంతో అతడికి తర్వాతి మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. ఇప్పుడు చివరి మ్యాచ్‌లో వైభవ్‌కు మరో అవకాశం దక్కలేదు.

బౌలింగ్‌లోనూ మార్పులుంటాయా?

భారత బౌలింగ్ విభాగంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడే అవకాశం రాలేదు. చివరి మ్యాచ్‌లో వీరిలో కుల్దీప్ యాదవ్ కు అవకాశం వచ్చింది. అలాగే భువనేశ్వర్ కుమార్ కు కూడా అవకాశం దక్కింది.

శ్రేయస్‌పై కూడా ఒత్తిడి

భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తొలి సెంచరీ సాధించిన తర్వాత అతడి బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రాలేదు. వరుసగా 40, 1, 16, 22, 42, 7, 5, 22 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్‌లో మళ్లీ ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు.

4-1తో ముగించాలని భారత్

ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో భారత్ వరుస విజయాలు సాధించింది. అయితే నాలుగో టీ20లో న్యూజిలాండ్ 259/7 పరుగుల భారీ స్కోరు చేయగా, భారత్ 172/9కే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ 107 పరుగులతో అదరగొట్టాడు. దీంతో కివీస్‌కు 87 పరుగుల విజయం దక్కింది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లో గెలిచి ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ భారత్ చేతిలో ఉన్నా.. చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే 4-1తో పర్యటనను మరింత ఘనంగా ముగించవచ్చు.

Follow Us