- Telugu News Photo Gallery Political photos KTR help to injured persons photos goes viral in social media
KTR Helping Photos: రియల్ హీరో అనిపించుకుంటున్న కేటీఆర్.. దగ్గరుండి మరీ రోడ్డుప్రమాదంకు గురైన విద్యార్థులకు..(ఫొటోస్)
హకీంపేట వద్ద మియాపూర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురికాగా, అటు వైపు నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్ గారు తన కాన్వాయ్ ని ఆపి, క్షతగాత్రులను ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
Updated on: Nov 18, 2021 | 10:55 AM

తెలంగాణ ఐటీ, పురపాలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని తన కాన్వాయ్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

తద్వారా వారికి సకాలంలో వైద్యం అందేలా చూశారు.

వివరాల్లోకి వెళితే.. బుధవారం హకీంపేట వద్ద మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

అదే సమయంలో సిరిసిల్ల పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు.

మధ్యమార్గంలో రోడ్డు ప్రమాద ఘటనను గమనించిన మంత్రి కాన్వాయ్‌ని ఆపేశారు.

ప్రమాదంలో గాయపడిన విద్యార్థు్లను తన ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

తనదైన మానవతా దృక్పధం చాటుకొని ప్రసంశలు అందుకుంటున్నారు మంత్రి కేటీఆర్..

కేటీఆర్ సహాయగుణాన్ని అందరికి తెలిసిందే అని కొందరి ప్రముఖుల మాట..





























