AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డివైడర్‌ను ఢీకొట్టి ఆపోజిట్‌ రోడ్డులో బోల్తాపడిన కారు.. స్పాట్‌లోనే యువకుడు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి.. ఆపోజిట్‌ రోడ్డుపై వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Hyderabad: డివైడర్‌ను ఢీకొట్టి ఆపోజిట్‌ రోడ్డులో బోల్తాపడిన కారు.. స్పాట్‌లోనే యువకుడు మృతి
Chevella Road Accident
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 01, 2026 | 12:12 PM

Share

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామెన గేటు సమీపంలో అతివేగంతో ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పి తీవ్ర ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి, రోడ్డు మధ్యలోని డివైడర్‌ను దాటుకుని అవతలి వైపు ఉన్న రహదారిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఈ దుర్ఘటనలో బాధితులంతా షాబాద్ మండలం పొత్గల్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై రాజ్‌కుమార్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన మరణంతో పొత్గల్ గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. కారులో ఉన్న మిగిలిన ప్రయాణికులు మురళి గౌడ్, ఒగ్గు వెంకటయ్య, కార్ల శివకుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఈ పామెన గేటు బ్రిడ్జి సమీప ప్రాంతం ప్రమాదాల జోన్‌గా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా సరిగ్గా ఇదే ప్రదేశంలో అతివేగం కారణంగా కారు బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వరస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పేదల ఓట్లను తొలగిస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
పేదల ఓట్లను తొలగిస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
డివైడర్‌ను ఢీకొట్టి ఆపోజిట్‌ రోడ్డులో కారు బోల్తా.. స్పాట్‌లోనే
డివైడర్‌ను ఢీకొట్టి ఆపోజిట్‌ రోడ్డులో కారు బోల్తా.. స్పాట్‌లోనే
టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్
టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్
ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే.. నా కూతురికి కూడా..
ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే.. నా కూతురికి కూడా..
కార్తీక మాసంలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
కార్తీక మాసంలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..