Viral Video: నాకేదీ అడ్డు.. ఇనుప కంచె మీదుగా చాకచక్యంగా దూకిన ఏనుగు.. వైరల్‌గా మారిన వీడియో..
ఏనుగు చూడడానికి భారీతనంతో కనిపించినా చాలామంది దానిని సాధు జంతువుగానే భావిస్తారు. అయితే అది కొన్ని..

ఏనుగు చూడడానికి భారీతనంతో కనిపించినా చాలామంది దానిని సాధు జంతువుగానే భావిస్తారు. అయితే అది కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఎవరైనా ఏనుగులను ఇబ్బంది పెడితే మాత్రం అంత సులభంగా వదిలిపెట్టవు. బీభత్సం సృష్టిస్తాయి. అంతేకాదు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు చాకచక్యంగా తప్పించుకుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మైసూర్ సమీపంలోని నాగర్ హోళే ఫారెస్ట్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది. బలంగా ఏర్పాటు చేసిన ఇనుక కంచెను తెలివిగా దాటేందుకు ప్రయత్నించింది. మొదట కొంచెం ఇబ్బందిపడింది. అయితే ఆతర్వాత చాకచక్యంగా ఫెన్సింగ్ మీదుగా దూకి అవతలివైపుకు చేరుకుంది.
ఈనెల 16న మైసూరు సమీపంలోని నాగరహోళే ఫారెస్ట్ రిజర్వ్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయని నాగరహోళే టైగర్ రిజర్వ్ డైరెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కాగా ఈ వీడియోని తమిళనాడు ఎన్విరాన్‌మెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ఈ ఏనుగు తెలివితేటలను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఒక్కోసారి అలాంటి కంచెలకు విద్యుత్ సరఫరా ఉంటుందని, తద్వారా అవి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని, కంచెలను తొలగించాలని కోరుతున్నారు.
Speechless ? #elephants pic.twitter.com/6S1WJqEkZS
— Supriya Sahu IAS (@supriyasahuias) November 17, 2021
Also Read:
Mysterious Fish: 555 పదునైన పళ్లు.. ఈ రాకాసి చేప యమ డేంజర్.. చూస్తే షాకవుతారు..