Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: ఆఫ్గన్ లో ఆకలితో కన్నబిడ్డల అమ్మకం 65 వేల కోసం పిల్లల్ని అమ్మేస్తున్న తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..

Afghanistan Crisis: ఆఫ్గన్ లో ఆకలితో కన్నబిడ్డల అమ్మకం 65 వేల కోసం పిల్లల్ని అమ్మేస్తున్న తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 19, 2021 | 8:47 AM

ఆఫ్ఘ‌నిస్థాన్ లో తాలిబ‌న్ల ప్ర‌భుత్వం వచ్చిన నాటి నుంచి పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అక్కడ ఆకలి చావులు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. చిన్న పిల్లలు తిన‌డానికి తిండి లేక అల‌మ‌టించి చ‌నిపోతున్నారు.


ఆఫ్ఘ‌నిస్థాన్ లో తాలిబ‌న్ల ప్ర‌భుత్వం వచ్చిన నాటి నుంచి పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అక్కడ ఆకలి చావులు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. చిన్న పిల్లలు తిన‌డానికి తిండి లేక అల‌మ‌టించి చ‌నిపోతున్నారు. ఇంత గ‌డ్డు ప‌రిస్థితి ఆఫ్ఘాన్ లో నెల‌కొన్న తాలిబ‌న్లు మాత్రం పట్టించు కోవ‌డం లేదు. అక్క‌డి ప్ర‌జ‌లు ఎదో ఒక ర‌కం చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆఫ్థాన్ ను తాలిబ‌న్లు పాలించ‌డం తో ఆ దేశానికి స‌హాయం చేయ‌డానికి ప్ర‌పంచ దేశాలు వెనక‌డుగు వేస్తున్నాయి. దీంతో ఆఫ్ఘ‌నిస్థాన్ లో రోజు రోజు స‌మ‌స్య‌లు పెరిగిపోతున్నాయి.

అఫ్ఘనిస్థాన్‌లో శాంతి స్థాపనకు ప్రయత్నించి ఘోరంగా విఫలమైంది అమెరికా. తాలిబన్ల ఆలోచనా విధానాన్ని సరిగ్గా అంచనా వేయలేక బోల్తాపడింది వైట్‌హౌజ్. అఫ్గన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య రాజకీయ ఏర్పాటు ఊహించిన విధంగా ముందుకు సాగలేదు. దీనికి ప్రధాన కారణం అమెరికానే అంటున్నారు దౌత్యవేత్తలు. ఏదేమైనా పాలన పగ్గాలు చేతులు మారాయి. మరి ఇప్పడు అక్కడి పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీస్తున్నారు పలు దేశాల విశ్లేషకులు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసిన చిన్నారుల పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు. అయితే, ప్రపంచ మీడియాకు అక్కడి వాస్తవ పరిస్థితిని చూపించే స్వేచ్ఛ ఇవ్వడంలేదు తాలిబన్లు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలు కేకలు ఆకాశానంటుతున్నాయి.

పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కేవలం 65 వేల కోసం పిల్లల్ని అమ్ముకుంటున్నారు తల్లిదండ్రులు. అంతేకాదు, గుండె తరుక్కుపోయే విషయం ఏంటంటే, ఆఖరికి ఉయ్యాలలో పడుకున్న బిడ్డను కూడా అమ్మి ఆకలి తీర్చుకుంటున్నారు ఆఫ్ఘన్ పేదలు. ఆ బిడ్డను పెంచి, నడిచే వరకు వచ్చాక తీసుకెళ్తామని అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మనసు ఒప్పుకోకున్నా బిడ్డల్ని అమ్ముకుంటున్నాం అంటున్నారు పేరెంట్స్. తమకు ఐదారుగురు పిల్లలు ఉన్నారని, ఒకరిని అమ్మి మిగతావారి ఆకలి తీరుస్తున్నామని చెబుతున్నారు తల్లిదండ్రులు. ఇందుకు అనేక కారణాలున్నాయి. అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అధికంగా విదేశీ నిధులపై ఆధారపడి ఉంది. ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేపట్టిన తరువాత విదేశీ సహాయం పూర్తిగా నిలిచిపోయింది. దాంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే జీతలతో సహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఫలితంగా అట్టడుగు వర్గాలు దీనస్థితికి చేరుకున్నాయి. ఆగస్టుకు ముందు ఎలాగోలా బతుకీడ్చిన వాళ్ల పరిస్థితి ఇప్పుడు మరింత దుర్భరం అయిపోయింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ఆహారం లేదు, తాగడానికి నీరు లేదు, మందులు లేదు, విద్య లేదు. ప్రపంచం అభివృద్ధి చెందుతోంది కానీ ఆఫ్ఘనిస్థాన్ తిరోగమనంలో ప్రయాణిస్తూ మధ్యయుగంలోకి వెళుతోంది. ఆఫ్గనిస్తాన్ లోని సుమారు 10లక్షల మంది చిన్నారుల ప్రాణాలు అరచేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో ఇబ్బందులను ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్‌ వెల్లడించింది. అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో భారీ విపత్తుగా మారనున్నదని.. నివారణ కోసం.. అంతర్జాతీయంగా అన్ని దేశాలు ముందుకు రావాలని.. పిల్లల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.

ఆఫ్ఘనిస్థాన్ దేశంలో లక్షలాది మంది ప్రజలు తినడానికి తిండి లేక విలవిలలాడుతున్నారు. దేశంలోని మూడోవంతు ప్రజలు ఇప్పటికే ఆహార సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ప్రస్తుతం 4 నుండి 5 మిలియన్లకు పైగా కుటుంబాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. తాలిబన్ల కొత్త నియమాలు,గత మూడు నెలలుగా ఆఫ్ఘనిస్తాన్ కు చేరుకునే అన్ని మార్గాల మూసివేతతో నెలకొన్న ఆహారధాన్యాల కొరత వెరసి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల జీవితం అత్యంత దుర్భరంగా మారబోతోంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 19, 2021 08:08 AM