Chennai Punarvasam: పునరావాస కేంద్రంలో చిన్నారి పుట్టిన రోజు జరిపిన ఆ ఖాకీలకు హ్యాట్సాఫ్..! (వీడియో)
తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతుంది. నవంబర్ 10 బుధవారం నాడు చెన్నై, చెంగల్ పెట్, తిరువల్లూరు, కాంచీపురం, విల్లుపురంలో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు వాన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.
తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతుంది. నవంబర్ 10 బుధవారం నాడు చెన్నై, చెంగల్ పెట్, తిరువల్లూరు, కాంచీపురం, విల్లుపురంలో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు వాన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే 20 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు..లోతట్టు ప్రాంతాలను, నీట మునిగే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలోనే దురప్పాకంలోని ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడి సెంటర్‌లో ఓ చిన్నారి పుట్టిన రోజును పురస్కరించుకుని పోలీసులు,సహాయక సిబ్బంది పెద్ద మనసు చాటుకున్నారు. ఆ చిన్నారికి పునరావాస కేంద్రంలోనే కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తమిళనాడును ముంచేత్తుతున్న వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడి పోలీసులు చూపుతున్న ఔదార్యంతో దేశవ్యాప్త ప్రశంసలు పొందుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

