Lunar Eclipse: నేడు ఈశాన్య భారతంలో పాక్షికంగా చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..

Lunar Eclipse 2021: ఈరోజు ఏడాదిలో రెండవ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భారత లోని ఈశాన్య ప్రాంతాల్లో పాక్షికంగా ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్..

Lunar Eclipse: నేడు ఈశాన్య భారతంలో పాక్షికంగా చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..
Lunar Eclipse 2021
Follow us

|

Updated on: Nov 19, 2021 | 10:25 AM

Lunar Eclipse 2021: ఈరోజు ఏడాదిలో రెండవ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భారత లోని ఈశాన్య ప్రాంతాల్లో పాక్షికంగా ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది.  అయితే భారత దేశంలో గ్రహణం ఏర్పడే సమయం.. పై కొన్ని నమ్మకాలు ఉన్నాయి. సాధారణ ప్రజలతో పాటు.. గర్భణీ స్త్రీలు కూడా గ్రహణం ఏర్పడే సమయంలో అనేక నియమాలను పాటిస్తారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు గ్రహణం హానికరమని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు.

గర్భణీ స్త్రీలలో గ్రహణం ఏర్పడే సమయంలో పిండం ఎదుగుదలపై ప్రభావితం చేస్తుందని, గర్భిణీ స్త్రీలలో హార్మోన్ల మార్పులను తీసుకువస్తుందని పూర్వకాలం నుంచి భారతీయుల్లో నమ్మకం. అందువలన గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీ  మానసికంగా ఇబ్బందులు , ఆందోళనలు ఎదుర్కొంటుంది.  అయితే ఈ విషయంపై శాస్త్రీయ రుజువు లేదు. అయినప్పటికీ, భారతీయులు ఇప్పటికీ ఈ విషయాన్నీ నమ్ముతారు. అంతేకాదు చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం ఏది ఏర్పడినా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా  పాటిస్తారు. ఈరోజు చంద్రగ్రహణం కనుక గర్భిణీ స్త్రీలు తీసుకోవాలిన జాగ్రత్తలు తెలుసుకుందాం..

గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన  జాగ్రత్తలు:

*గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే ఆహారం జీర్ణమవ్వడంతో ఇబ్బంది తలెత్తుంది. *గ్రహణం ఏర్పడిన సమయంలో స్నానం చేయవద్దు. *గ్రహణాలను నేరుగా చూడవద్దు. *గ్రహణం ఏర్పడినప్పటి నుంచి గ్రహణం విడిచే వరకూ శారీరక శ్రమ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. *కత్తి, కత్తెర , సూదులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించవద్దని పెద్దలు చెబుతారు. * గ్రహణం ఏర్పడినప్పుడు నీటిని తాగరాదు. * గ్రహణం ఏర్పడినప్పుడు ఏమైనా ఆహారపదార్ధాలను వండినట్లు అయితే దర్భతో కానీ,, తులసి ఆకులను వేసిగానీ భద్రపరచండి. * గర్భిణీ స్త్రీలు పనులు చేయవద్దని, బహిర్భూమికి వెళ్లవద్దని పెద్దలు సూచించారు.

Also Read:  దివిసీమ ఉప్పెన.. ఆ కాళరాత్రికి నేటితో 44 ఏళ్ళు.. పకృతి చేసిన గాయం.. ఇంకా మానని వైనం..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో