Guru Nanak Jayanti 2021: గురునానక్ 552 వ జయంతి నేడు.. ఘనంగా జరుపుకుంటున్న సిక్కులు..

Guru Nanak Jayanti 2021: దేశ ప్రజలంతా కార్తీక పున్నమి రోజున గురునానక్ దేవ్ జయంతిని జరుపుకుంటారు. సిక్కు మతంలో ఈరోజు అతిముఖ్యమైన పండగ. సిక్కు మత వ్యవస్థాపకుడు శ్రీ గురునానక్ దేవ్ జయంతి నేడు. ఈ సంవత్సరం గురునానక్ 552 వ జయంతి. ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన పది మంది సిక్కు గురువులలో మొదటి వ్యక్తి గురునానక్.

Surya Kala

|

Updated on: Nov 19, 2021 | 1:49 PM

సిక్కు మతానికి పునాది వేసిన శ్రీ గురునానక్ దేవ్ పుట్టిన రోజు నేడు. ఈ సంవత్సరం గురునానక్ 552 వ జయంతిని సిక్కులు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.

1 / 8
 పది మంది సిక్కు గురువులలో మొదటివారు గురు నానక్. ఆయన పుట్టిన రోజున ఆయన సమాజానికి చేసిన బోధనలను గుర్తు చేసుకుంటారు.

2 / 8
1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ ఒక హిందూ కుటుంబంలో జన్మించాడు. మెహతా కలు, మాతా త్రిపుర దంపతులకు గురు నానక్ జన్మించారు.

3 / 8
హిందువుగా జన్మించిన గురునానక్.. తత్వవేత్తగా మారి.. అనంతరం సిక్కు మతాన్ని స్థాపించారు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతం. సిక్కులు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు) ని నమ్మతారు.

4 / 8
దేవుడు ఒక్కడే, ఆయన నామం ఒక్కటే సత్యం, ఆయనే సృష్టికర్త, నిర్భయుడు, ద్వేషం లేనివాడు, చిరంజీవుడు, జనన మరణాలకు అతీతుడు, ఆయన అనుగ్రహంతోనే జపించగలరు అంటూ అనేక ఆధ్యాత్మిక బోధనలు చేశారు.

5 / 8
చిన్నతనంలోనే నానక్ హిందూ మతంలోని తాత్త్వికతపై ఆకర్షితుడై, జీవితంలోని రహస్యాలను అన్వేషించేందుకు ఇల్లు వదలిన గురు నానక్ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణంలో 974 శ్లోకాలను వ్రాశాడు. ఆయన అందించిన బోధనలలు గురు గ్రంథ్ సాహిబ్ (పవిత్ర పుస్తకం)లో ఉన్నాయి. ఇది సిక్కులకు పవిత్ర మత గ్రంథం.

6 / 8
నానక్ బతాలాకు చెందిన వ్యాపారి మూల్ చంద్ చోనా కుమార్తె సులేఖ్నీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శ్రీచంద్, లక్ష్మీదాస్ అనే కుమారులు జన్మించారు

7 / 8
గురు నానక్ తన జీవితం చివరి సంవత్సరాల్లో పాకిస్థాన్ లోని  కర్తార్ పూర్ జీవించారు. కులమత బేధం లేకుండా జీవితాన్ని సాగించారు. 22 సెప్టెంబరు 1539లో 70వ ఏట మరణించారు. సిక్కులకు పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్‌లో గురుద్వారా సిక్కుల పవిత్ర క్షేత్రం. ఏటా వెలది మంది సిక్కులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు.

8 / 8
Follow us