- Telugu News Photo Gallery Spiritual photos Hinna jeeyar swamy invited cm jagan for unveiling of statue of equality near hyderabad
Chinna Jeeyar Swamy-CM Jagan: సమతామూర్తి విగ్రహావిష్కరణకు సీఎం జగన్‌ను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్‌లోని త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు. ఈ గొప్ప వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను చిన్నజీయర్ స్వామీజీ ఆహ్వానిస్తున్నారు.
Ram Naramaneni | Edited By: Anil kumar poka
Updated on: Feb 01, 2022 | 5:18 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి నివాసంలో కలిసిన త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ... శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఆహ్వాన పత్రికను స్వయంగా అందించారు.

సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను సీఎంకు వివరించారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని జగన్‌ను స్వామీజీ కోరారు.

సమతాస్ఫూర్తి కేంద్రం సహా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేయనున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను ఆసక్తిగా తెలుసుకున్నారు సీఎం జగన్.

ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామీజీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు సీఎం. స్వామీజీ ఆయన్ను పట్టు శాలవాతో సత్కరించి ఆశీస్సులు అందజేశారు.

సమతామూర్తి విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికలోని వివిధ అంశాలను ఆసక్తిగా తిలకించారు సీఎం జగన్

అనేక విశిష్టలతో నిర్మితమవుతున్న సమతాస్ఫూర్తి కేంద్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. వెయ్యి కోట్లతో మొత్తం 200 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న స్టాట్చ్యూ ఆఫ్ ఈక్వాలిటీని 216 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రామానుజాచార్యలు విగ్రహాన్ని108 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు.





























