Tirumala Rains: ఘాట్ రోడ్డులో వాహనాల రాక పోకల పునరుద్ధరణ దిశగా టీటీడీ.. అనుమతిపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకోనున్న అధికారులు

Tirumala Rains: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో గత 25 ఏళ్ల తరవాత రికార్డ్ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. ఘాట్ రోడ్డు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీవర్షాల నేపథ్యంలో..

Tirumala Rains: ఘాట్ రోడ్డులో వాహనాల రాక పోకల పునరుద్ధరణ దిశగా టీటీడీ.. అనుమతిపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకోనున్న అధికారులు
Tirumala Rains
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2021 | 9:17 AM

Tirumala Rains: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో గత 25 ఏళ్ల తరవాత రికార్డ్ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. ఘాట్ రోడ్డు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీవర్షాల నేపథ్యంలో నిన్నటి నుంచి శ్రీవారి దర్శనానికి బ్రేక్ ఇచ్చారు. అంతేకాదు కొండపైకి భక్తుల రాకపోకలపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో తాజాగా డౌన్ ఘాట్ రోడ్డులో వాహనాల రాక పోకల పునరుద్ధరణ దిశగా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం తరువాత అప్ ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నారు.

అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించామని టీటీడీ ప్రకటించింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రమించి తొలగించారు. దీంతో భక్తుల రాకపోకలకు కొంతమేర ఇబ్బందులు తొలగాయి. భక్తుల సౌకర్యం దృష్యా ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతించడం జరుగుతోంది.

అయితే భక్తులు ఫోటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపి ఉంచడం వంటి పనులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మీరు వాహనాలు నిలిపి.. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని టీటీడీ కోరుతుంది. భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి తిరుమల కు వెళ్ళే ఘాట్ రోడ్ లో అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో వాటి తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. మధ్యాహ్నం తరువాత పరిస్థితి ని అంచనా వేసి ఈ మార్గంలో వాహనాల ను అనుమతించే విషయం పై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.

Also Read:  టూ ఇండియాస్ పేరుతో కమెడియన్ విదేశంలో షో.. పుట్టిన దేశాన్నిహేళన చేసిన వీర్‌దాస్‌ షోలు వద్దంటున్న నెటిజన్లు..