Karthika Pournami: కార్తీక పున్నమి వేళ.. పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ.. శివనామ స్మరణతో మార్మోరుగుతున్న ఆలయాలు

Karthika Pournami: కార్తీకమాసాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలోని ప్రతిరోజూ పర్వదినమే. ముఖ్యంగా కార్తీక పౌర్ణమిని..

Karthika Pournami: కార్తీక పున్నమి వేళ.. పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ.. శివనామ స్మరణతో మార్మోరుగుతున్న ఆలయాలు
Karthika Punnami
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2021 | 8:21 AM

Karthika Pournami: కార్తీకమాసాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలోని ప్రతిరోజూ పర్వదినమే. ముఖ్యంగా కార్తీక పౌర్ణమిని హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఈరోజు కార్తీక పున్నమి శోభతో శివాలయాలు కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తిక పున్నమి పురష్కరించుకుని శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు నదుల్లో పుణ్యస్నాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. భోళాశంకరుడికి ప్రత్యేక పూజలు, పాలాభిషేకం, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సాయంత్రం ఆకాశ దీపాలంకరణ, జ్వాలాతోరణం నిర్వహించనున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

ఈరోజు నదీ స్నానం ఆచరిస్తారు. శివుడిని ప్రార్థించి ఉపవాసం ఉంటారు. శివునికి పాలు, తేనెతో రుద్రాభిషేకం చేస్తారు. అంతేకాదు కార్తీక పౌర్ణమి రోజున మహిళలు కేధారేశ్వర నోము, వ్రతాలు ఆచరిస్తారు. ఎక్కువగా నోముల ఉద్యాపనను తీర్చుకుంటారు. ఇక కార్తీక పున్నమి రోజున కొన్ని ప్రదేశాల్లో జాతర కూడా జారుకుంటారు. అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయంతో పాటు ఒడిశా లో కూడా పున్నమి రోజున జాతరను నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో కార్తీక పున్నమి రోజున కార్తికేయుడిని పూజిస్తారు. కటక్‌లో కార్తీక పూర్ణిమ రోజున కార్తికేశ్వర ఆరాధన చేస్తారు. కార్తీక పూర్ణిమ సిక్కులకు పవిత్రమైన రోజు. ఈరోజున సిక్కుల గురువు శ్రీ గురునానక్ జయంతి. కనుక సిక్కులు కార్తీక పున్నమిని భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.

Also Read:

ఈరోజు ఈ రాశివారు కొత్త నగలు, కొత్త పనులు కొనుగోలు చేస్తారు.. ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

ఉత్సవాల్లో కాలితో స్వామి తంతే చాలు కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.. క్యూ కట్టిన భక్తులు