Vir Das: టూ ఇండియాస్ పేరుతో కమెడియన్ విదేశంలో షో.. పుట్టిన దేశాన్నిహేళన చేసిన వీర్‌దాస్ షోలు వద్దంటున్న నెటిజన్లు..
Comedian Vir Das: ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ 'టూ ఇండియాస్ ' పేరుతో ఇటీవల అమెరికాలో ఓ ప్రదర్శన ఇచ్చారు. డ్యూయల్ ఇండియా అంటూ వీర్ దాస్ .. ఇచ్చిన..
Comedian Vir Das: ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ ‘టూ ఇండియాస్ ‘ పేరుతో ఇటీవల అమెరికాలో ఓ ప్రదర్శన ఇచ్చారు. డ్యూయల్ ఇండియా అంటూ వీర్ దాస్ .. ఇచ్చిన ఈ ప్రదర్శన ఇప్పుడు వివాదాస్పదమైంది. ఐ కమ్ ఫ్రమ్ టూ ఇండియాస్ అంటూ ఇచ్చిన వీర్‌దాస్ పై సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ విరుచుకుపడుతున్నారు. పగలు మహిళలను పూజిస్తూ, రాత్రి లైంగికదాడులకు పాల్పడే దేశం నుంచి వచ్చానంటూ వీర్‌దాస్ చేసిన ప్రదర్శనను మధ్యప్రదేశ్ హోం శాఖా మంత్రి నరోత్తమ్ మిశ్రా తప్పుపట్టారు.
అంతేకాదు ఇక నుంచి తమ రాష్ట్రంలో వీర్‌దాస్ ప్రదర్శనలను అనుమతించమని చెప్పారు. భారత దేశంలో నివసిస్తూ.. విదేశాల్లో భారతదేశాన్ని హేళన చేస్తూ ఇచ్చే ప్రదర్శనలను తాము వ్యతిరేకిస్తామని,.. అలా ప్రదర్శనలను ఇచ్చినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాష్ట్రంలో అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. పుట్టిన దేశాన్ని ఎగతాళి చేసేవారిని తాను జోకర్లుగా భావిస్తానని అన్నారు. అంతేకాదు దేశాన్ని అ గౌరవపరిచినందుకు కచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వీర్ దాస్ తాను ఇచ్చిన ప్రదర్శన గురించి క్షమాపణ చెబితేనే మధ్యప్రదేశ్ లో అనుమతించాలా వద్దా అనే విషయం పై ఆలోచిస్తానని మంత్రి నరోత్తమ చెప్పారు.
ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ డ్యూయల్ ఇండియా పేరుతో ఓ ప్రదర్శన ఇచ్చారు. పగలు మహిళలను పూజిస్తూ, రాత్రి లైంగికదాడులకు పాల్పడే దేశం నుంచి వచ్చానంటూ వీర్ దాస్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విదేశీ గడ్డపై దాస్ భారత్‌ను అవమానించారంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే వీర్ దాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశం గురించి విదేశాల్లో తప్పుగా మాట్లాడిన వీర్ దాస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు భారత దేశంలో పుట్టి.. ఇక్కడ తిండి తింటూ.. ఇక్కడ బతుకుతూ.. దేశాన్ని హేళన చేయడం కొంతమందికి ఫ్యాషన్ గా మారింది అంటూ మండిపడుతున్నారు.
Also Read: కార్తీక పున్నమి వేళ.. పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ.. శివనామ స్మరణతో మార్మోరుగుతున్న ఆలయాలు