Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Promo: బిగ్‍‏బాస్‏కు షాకిచ్చిన సిరి.. షణ్ముఖ్.. ప్రజలపై నమ్మకం ఉందంటూ..

బిగ్‏బాస్ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో.. ఎలాంటి గేమ్ ప్లాన్ అమలు చేస్తాడో చెప్పడం కష్టమే. ఈవారం ఎలిమినేషన్ నుంచి బయటపడేందుకు

Bigg Boss 5 Promo: బిగ్‍‏బాస్‏కు షాకిచ్చిన సిరి.. షణ్ముఖ్.. ప్రజలపై నమ్మకం ఉందంటూ..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2021 | 3:56 PM

బిగ్‏బాస్ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో.. ఎలాంటి గేమ్ ప్లాన్ అమలు చేస్తాడో చెప్పడం కష్టమే. ఈవారం ఎలిమినేషన్ నుంచి బయటపడేందుకు కంటెస్టెంట్స్‏కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. నామినేషన్స్ లో ఉన్న సభ్యుల ముందు మరో గేమ్ పెట్టాడు. అందులో గెలిచినవారికి ఎవిక్షన్ పాస్ లభిస్తుందని తెలిపారు. ఇందుకోసం నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా అనే గేమ్ ఇచ్చారు. అందులో భాగంగా.. ఫైర్ ఇంజిన్ బజర్ మోగగానే ఇద్దరు సభ్యులు వెళ్లి కూర్చోవాలి. వారి ఎదురుగా మంటల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఫోటోలు ఉంటాయి. మంటల్లో ఫోటోలున్న సభ్యులు ఫైర్ ఇంజన్లో ఉన్న సభ్యులను ఎవిక్షన్ పాస్ కోసం రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు బిగ్‏బాస్ .

అయితే ముందుగా షణ్ము, సిరి ఫైర్ ఇంజన్లో కూర్చోగా.. వారికి ఎదురుగా ఉన్న మంటల్లో ప్రియాంక, సన్నీ ఫోటోస్ వచ్చాయి. దీంతో సన్నీ.. తను కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని… ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ మారుతున్నందకు తనకు ఎవిక్షన్ పాస్ కావాలని కోరారు. ఇక పింకీ కూడా తను మానసికంగా స్ట్రాంగ్ అని.. ఇక పై గేమ్ లో ముందుకు వెళ్లాలంటే తనకు ఎవిక్షన్ పాన్ కావాలంటూ రిక్వెస్ట్ చేసింది. అయితే వీరిలో ఎవరు గెలిచారో తెలియదు. ఇక ఆ తర్వాత శ్రీరామచంద్ర, ఆనీ మాస్టర్ ఫైర్ ఇంజిన్ లో కూర్చోగా.. వారికి ఎదురుగా మంటల్లో సిరి, షణ్ముఖ్ ఫోటోలు వచ్చాయి. అయితే తమకు ఎవిక్షన్ పాస్ అవసరం లేదని.. ప్రజలు తమను ఓట్లు వేసి గెలిపించుకుంటారనే నమ్మకం ఉందని తేల్చిచెప్పారు. దీంతో ఆనీ మాస్టర్, శ్రీరామచంద్ర షాకయ్యారు.

ప్రోమో..

Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాపై కామెంట్ చేసిన నెటిజన్.. మూవీ టీం ఆన్సర్ అదుర్స్..

Megastar Chiranjeevi: తిరుపతి వరదలపై స్పందించిన మెగాస్టార్.. ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి చిరు విజ్ఞప్తి..

Mehreen Pirzada: మైమరపించే వయ్యారం.. హనీ పాపకే సొంతం.. మెహరీన్ లేటెస్ట్ ఫొటోస్..