RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాపై కామెంట్ చేసిన నెటిజన్.. మూవీ టీం ఆన్సర్ అదుర్స్..

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాపై కామెంట్ చేసిన నెటిజన్.. మూవీ టీం ఆన్సర్ అదుర్స్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2021 | 3:38 PM

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి చూపే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. ఇక వీరిద్దరికి జంటగా అలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో కలిసి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ముందు నుంచి భారీగా అంచనాలున్నాయి. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నవంబర్ 19తో మూడేళ్లు అవుతుంది. సరిగ్గా నవంబర్ 18న 2018న రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ స్టార్ట్ చేసినట్లుగా డీవీవీ నిర్మాణ సంస్థ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ఓ నెటిజన్.. ఆర్ఆర్ఆర్ సినిమా పై వ్యంగ్యంగా స్పందించాడు. అప్పటి ట్వీట్ రీట్విట్ చేస్తూ. “డిప్లొమాలో ఉన్నప్పుడు మీరు సినిమా షూటింగ్ ప్రారంభించారు. బీటేక్ కూడా అయిపోయింది. సినిమా మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు” అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇది చూసిన చిత్రయూనిట్.. నెటిజన్ ట్వీట్ కు స్పందించింది. అతడి ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. ఏం చేద్దాం మరి.. నువ్వు కాలేజీకి వెళ్లనన్ని రోజులు మేము కూడా షూటింగ్ చేయలేదు అంటూ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమైనట్లుగా చెప్పకనే చెప్పింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

ట్వీట్..

Also Read: Megastar Chiranjeevi: తిరుపతి వరదలపై స్పందించిన మెగాస్టార్.. ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి చిరు విజ్ఞప్తి..

Shyam Singha Roy: షేక్ చేస్తున్న “శ్యామ్ సింగరాయ్” .. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతున్న టీజర్..

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..