Megastar Chiranjeevi: తిరుపతి వరదలపై స్పందించిన మెగాస్టార్.. ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి చిరు విజ్ఞప్తి..

చిత్తూరు జిల్లాలో వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలో పరిస్థితులు మరింత

Megastar Chiranjeevi: తిరుపతి వరదలపై స్పందించిన మెగాస్టార్.. ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి  చిరు విజ్ఞప్తి..
Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2021 | 3:30 PM

తిరుపతి, తిరుమలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతుండడం చూస్తుంటే మనసును కలిచివేస్తున్నాయన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో తిరుపతి, తిరుమల పరిస్థితులపై ట్వీట్ చేశారు. ” గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కోంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం, టీటీడీలు కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూత నివ్వాల్సిందిగా కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు చిరు.

చిత్తూరు జిల్లాలో వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి.. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో తిరుమల ఘాట్ రోడ్డులోనూ.. తిరుపతిలోనూ వరదనీరు పారుతూ భక్తుల్ని, స్థానికులను భయందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే స్థానిక అధికారులుగా రక్షణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వరుణుడి కోపానికి చిత్తూరు జిల్లా వణికిపోతుంది. రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. చెట్లు.. కొండ చరియాలు విరికిపడుతున్నాయి. దీంతో తిరుమల ఘాడ్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. బుద్దవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చిత్తూరు, కడప జిల్లాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ట్వీట్..

చిరంజీవి మాత్రమే కాకుండా.. తిరుపతి, తిరుమల పరిస్థితుల పై సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. మరోవైపు మంచు లక్ష్మి సైతం వరదలపై స్పందించారు. తిరుమల, తిరుపతిలలో పరిస్థితులలో అతలాకుతలంగా మారాయని.. ఇప్పట్లో తిరుపతికి వెళ్లొద్దని కోరారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. వరద నీటిలో ఓ వ్యక్తి కొట్టుకుపోతున్న వీడియోనూ షేర్ చేస్తూ.. తిరుపతిలో ఉన్న పరిస్థితులకు ఇది నిదర్శనం. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నవారు దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ మీ వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఫోన్‌ చేసి కనుక్కోండి. ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది అంటూ ట్వీట్ చేశారు.

Also Read:  Mehreen Pirzada: మైమరపించే వయ్యారం.. హనీ పాపకే సొంతం.. మెహరీన్ లేటెస్ట్ ఫొటోస్..

Chef Mantra: ఆహా అందిస్తున్న సరికొత్త షో చెఫ్ మంత్ర‌.. రెజీనా తర్వాత వచ్చే గెస్ట్ ఎవరంటే..