Kadapa Floods: వర్షాలు, వరదలతో కడప జిల్లా అతలాకుతలం.. 30మంది గల్లంతు.. 12 మృతదేహాలు లభ్యం.. నేడు కొనసాగనున్న గాలింపు

Kadapa Floods: భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లా అతలాకుతలమయ్యింది. చెయ్యేరు నది పరివాహక పరిధిలోని పల్లెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో...

Kadapa Floods: వర్షాలు, వరదలతో కడప జిల్లా అతలాకుతలం.. 30మంది గల్లంతు.. 12 మృతదేహాలు లభ్యం.. నేడు కొనసాగనున్న గాలింపు
Kadapa Floods
Follow us
Surya Kala

|

Updated on: Nov 20, 2021 | 7:02 AM

Kadapa Floods: భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లా అతలాకుతలమయ్యింది. చెయ్యేరు నది పరివాహక పరిధిలోని పల్లెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెయ్యేరు వంతెన వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టింది. వరద ఉధృతితో ఈ నది పరివాహక పరిధిలోని రాజంపేట, పులపత్తూరు‌, మందపల్లి శివాలయం ఘటన, బస్సు ప్రమాదం వేర్వేరు ఘటనల్లో30 మంది గల్లంతు కాగా.. నిన్న రాత్రి వరకు 12మృతదేహాలు లభ్యమయ్యాయి.  పులపత్తూరు, మందపల్లి ఘటనలో 4మృతదేహాలు, బస్సు ఘటనలో 4మృతదేహాలు, గుండ్లూరు శివాలయం, మసీదులలో రెండు మృతదేహాలు, అన్నయ్యవారి పల్లెలో రెండు మృతదేహాలు లభ్యమయినట్లు జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ప్రమాదాలలో గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు.

క్రమేపి వరద నీటి ఉదృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని చెప్పారు. వరద నీటిలో కొట్టుకుని పోయినవారి కోసం నిన్న రాత్రి వరకూ NDRF, SDRF బృందాలు గాలించారు. ఈరోజు ఉదయం తిరిగి గాలింపు చర్యలను కొనసాగించనున్నారు.  వరద నీటిలో కొట్టుకుని పోయిన మృతదేహాల కోసం ప్రత్యేక పడవల్లో మృత దేహాల కోసం గాలిస్తున్న ఎస్డీఆర్ఎప్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలు.

మైలవరం జలాశయం వరద నీటితో పోటెత్తింది. దీంతో మైలవరం జలాశయంలో 11 గేట్లు ఎత్తి 1.5టీఎంసీల నీటిని పెన్నానదికి విడుదల చేశారు.  మరోవైపు అధికారులు పెన్నానది పరివాహక ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లమని సూచించారు. పెన్నానదికి భారీగా వరద నీరు చేరుతుండడంతో.. జమ్మలమడుగు, ప్రోద్దుటూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు మండలాలకు పొంచి ఉంది. నిన్న చెయ్యేరు ఘటన పునరావృతం కాకపండా లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తానికి కడప జిల్లాలో అనేక పల్లెలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

Also Read : RGNIYD Recruitment: రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..