Sounds From earth: చిత్తూరు జిల్లాలో భూమిలోంచి వింత శబ్ధాలు.. భయాందోళనలో గ్రామస్తులు.. (వీడియో)
చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల భూమిలోంచి వింత శబ్ధాలు రావటం కలకలం రేపింది. జిల్లాలోని పూతలపట్టు, నియోజకవర్గం, ఐరాల మండలం, ఎర్రెపల్లి పంచాయతీ, అబ్బ గుండు గ్రామంలో భూమిలో నుండి వింత శబ్దాలు, భూమి కంపించటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు...
చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల భూమిలోంచి వింత శబ్ధాలు రావటం కలకలం రేపింది. జిల్లాలోని పూతలపట్టు, నియోజకవర్గం, ఐరాల మండలం, ఎర్రెపల్లి పంచాయతీ, అబ్బ గుండు గ్రామంలో భూమిలో నుండి వింత శబ్దాలు, భూమి కంపించటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు..విషయం తెలియటంతో ఐరాల మండల ఎమ్మార్వో బెన్ రాజ్ , ఎంపిడిఓ నిర్మలాదేవి హుటా హుటినా ఆయా గ్రామాలను సందర్శించారు.
అధికారులు గ్రామ ప్రజలను విచారించగా గత 10 రోజులు గా గ్రామంలో రాత్రి పూట వింత శబ్దాలు వచ్చేవని, కానీ గత రెండు రోజులుగా పగటి పూట కూడా భూమిలో నుంచి వింత శబ్దాలతో పాటు భూమి కంపిస్తుండడంతో గ్రామంలో ఉన్న ఇండల్లో గోడలు బీటలు వారుతున్నాయి..భూమి కమిస్తుడడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని గ్రామస్తులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి మైనింగ్ కార్యకలాపాలే కారణంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఐరాల యస్.ఐ. హరిప్రసాద్, సిబ్బందితో కలిసి అబ్బ గుండు గ్రామానాన్ని సందర్శించారు. ఆ సమయంలోనూ భూమి నుంచి శబ్దాలు వచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఐరాల ఎంపీడీఓ, మైనింగ్ అధికారులులకు తెలియజేసారు. చిత్తూరు మైనింగ్ ఎడి ప్రకాష్ కుమార్ గ్రామాన్ని సందర్శించి, గ్రామ ప్రజలతో మాట్లాడి వారిని అన్ని విదాల ఆదుకుంటామని, గ్రామస్తులు ధైర్యంగా ఉండాలని మైనింగ్ ఎ.డి . ప్రకాష్ కుమార్ కోరారు..
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..