Athlete protests: పద్మశ్రీ అవార్డుతో సీఎం ఇంటిముందు అథ్లెట్ నిరసన..! కారణం తెలిస్తే ఒప్పుకోవాల్సిందే.. (వీడియో)
పారా అథ్లెట్స్‌తో సమాన హక్కులు కావాలంటూ నిరసనకు దిగారు పద్మశ్రీ అవార్డు గ్రహీత దివ్యాంగ రెజ్లర్ వీరేందర్ సింగ్. ఈ క్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ ఇంటి ముందు నిరసన చేపట్టారు. గతంలో ఆయనకు అర్జున అవార్డు కూడా రాగా, ఆ అవార్డును,
పారా అథ్లెట్స్‌తో సమాన హక్కులు కావాలంటూ నిరసనకు దిగారు పద్మశ్రీ అవార్డు గ్రహీత దివ్యాంగ రెజ్లర్ వీరేందర్ సింగ్. ఈ క్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ ఇంటి ముందు నిరసన చేపట్టారు. గతంలో ఆయనకు అర్జున అవార్డు కూడా రాగా, ఆ అవార్డును, పారా క్రీడల్లో తనకు వచ్చిన పతకాలను కూడా తన నిరసన దీక్షలో ప్రదర్శించారు.
కాగా దివ్యాంగుడైన రెజ్లర్ వీరేందర్ సింగ్ నవంబరు 9న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆ మరుసటి రోజే తన పద్మశ్రీ అవార్డుతో సీఎం ఇంటిముందు దీక్షకు దిగారు. బధిర క్రీడాకారులకు కూడా ఇతర పారా అథ్లెట్లతో సమానంగా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పారా అథ్లెట్లు అందరినీ ఒకేలా చూస్తున్నప్పుడు, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమానత్వం చూపడంలేదని వీరేందర్ సింగ్ ప్రశ్నించారు. బధిర క్రీడాకారులకు కూడా సమాన హక్కులు కల్పించేంత వరకు సీఎం ఇంటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

