Shyam Singha Roy: షేక్ చేస్తున్న “శ్యామ్ సింగరాయ్” .. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతున్న టీజర్..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. రెండేళ్లుగా నాని సినిమా థియేటర్ వైపు చూడలేదు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన వి

Shyam Singha Roy: షేక్ చేస్తున్న శ్యామ్ సింగరాయ్ .. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతున్న టీజర్..
Nani
Follow us

|

Updated on: Nov 19, 2021 | 1:24 PM

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. రెండేళ్లుగా నాని సినిమా థియేటర్ వైపు చూడలేదు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన వి సినిమా ఓటీటీ వేదికగానే విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే రీసెంట్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమా చేశాడు నాని. ఈ సినిమా కూడా ఓటీటీనే నమ్ముకొని రిలీజ్ అయ్యింది. కానీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దాంతో నాని అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. కానీ ఈ సారి థియేటర్స్ లో వచ్చి సాలిడ్ హిట్ కొడతా అంటున్నాడు నాని. నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాను రాహుల్ సంకృత్యాన్  తెరకెక్కిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కింది.

ఇక ఈ సినిమానుంచి తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కలకత్తా బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక టీజర్ లో నాని పాత్ర కు సంబంధించిన రెండు డిఫరెంట్ షేడ్స్ ను చూపించారు. ముఖ్యంగా ఆ కాలంలో స్త్రీలపై జరిగిన అన్యాయాలకు అండగా ఒక ఒక వ్యక్తి నిలబడటాన్ని చూపించారు. ఇక ఈ టీజర్ రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. 24 గంటల్లోనే ఈ టీజర్ 6.3 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలింది. తెలుగుతో పాటు తమిళ.. మలయాళ.. కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sharwanand : ఓటీటీ బాటలో కుర్ర హీరో సినిమా.. శర్వానంద్ ఆశలన్నీ ఆ మూవీ పైనే మరి..

Naga Chaitanya: వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా అక్కినేని యంగ్ హీరో.. చైతన్య చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..

Victory Venkatesh: న్యూ లుక్ తో అదరగొడుతున్న వెంకీ మామ.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..