Sharwanand : ఓటీటీ బాటలో కుర్ర హీరో సినిమా.. శర్వానంద్ ఆశలన్నీ ఆ మూవీ పైనే మరి..

యంగ్ హీరో శర్వానంద్ హిట్ అనే పదం విని చాలా రోజులైంది . అప్పుడెప్పుడో వచ్చిన మహానుభావుడు సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పడి పడి లేచే మనసు

Sharwanand : ఓటీటీ బాటలో కుర్ర హీరో సినిమా.. శర్వానంద్ ఆశలన్నీ ఆ మూవీ పైనే మరి..
Sharwanand
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2021 | 1:02 PM

Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ హిట్ అనే పదం విని చాలా రోజులైంది. అప్పుడెప్పుడో వచ్చిన మహానుభావుడు సినిమా తర్వాత.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పడి పడి లేచే మనసు సినిమా కాస్త పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన రణరంగం సినిమా ఆ వెంటనే జాను, శ్రీకారం, రీసెంట్ గా మహాసముద్రం ఇలా వరుసగా డిజాస్టర్స్ అందుకున్నాడు శర్వా. ఇటీవల వచ్చిన మహాసముద్రం సినిమా పై భారీ అంచనాలనే పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేశారు. దాంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. ఇక ఇప్పుడు ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రలో అమల నటిస్తున్నారు.

ఇప్పుడు శర్వా ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కథ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పై ఇప్పుడు ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఒకే ఒక జీవితం సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమాకోసం ప్రముఖ ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు కూడా చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాతోపాటు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు శర్వా. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Urfi Javed : బిగ్‌బాస్‌ నటి డ్రస్‌పై నెటిజన్ల విసుర్లు.. వార్డ్‌రోబ్‌ కలెక్షన్‌ చెత్తగా ఉందని ట్రోలింగ్‌..

Most Eligible Bachelor: ఆహా అందిస్తున్న అందమైన ప్రేమకథ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.. ఓటీటీకి వచ్చేసిన సినిమా

Bigg Boss 5 Telugu: రెచ్చిపోతున్నారు.. హద్దుమీరుతున్నారు.. ఆ ఇద్దరి పై నెటిజన్స్ ఫైర్.. కారణం ఇదే..

గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్