Most Eligible Bachelor: ఆహా అందిస్తున్న అందమైన ప్రేమకథ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.. ఓటీటీకి వచ్చేసిన సినిమా

అచ్చ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఆహా, అస‌లు సిస‌లైన తెలుగు వినోదానికి ఇంటికి పేరుగా మారింది ఆహా. ఇప్పటికే సూపర్ హిట్ సిమాలను

Most Eligible Bachelor: ఆహా అందిస్తున్న అందమైన ప్రేమకథ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'.. ఓటీటీకి వచ్చేసిన సినిమా
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2021 | 7:28 AM

Most Eligible Bachelor: అచ్చ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఆహా, అస‌లు సిస‌లైన తెలుగు వినోదానికి ఇంటికి పేరుగా మారింది ఆహా. ఇప్పటికే సూపర్ హిట్ సిమాలను, అదిరిపోయే గేమ్ షోలను, ఆకట్టుకునే టాక్ షోలను అందిస్తున్న ఆహా మరో సూపర్ హిట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. నేటి నుంచి( న‌వంబ‌ర్ 19) నుంచి ఆహా అందిస్తోంది బ్లాక్ బ‌స్ట‌ర్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌` ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే న‌టించిన ఈ సినిమాను బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించారు. అద్భుత‌మైన పెర్ఫార్మెన్స్ లు, మోడ్ర‌న్ డేస్ రిలేష‌న్‌షిప్స్ మీద ఫోక‌స్ అయిన క‌థ‌, మ‌న‌సును ట‌చ్ చేసే గోపీసుంద‌ర్ మ్యూజిక్‌… థియేట‌ర్ల‌లో జ‌నాల‌తో ఆహా అనిపించుకుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. సినిమా రిలీజ్ అయ్యీ కాగానే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు, హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను ఆహాలో రిపీట్ చేయ‌డానికి రెడీ అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమా కోసం ఆహా క‌ట్ చేసిన ట్రైల‌ర్ ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో అఖిల్ హ‌ర్ష అనే కేర‌క్ట‌ర్ చేశాడు. రెండు ప‌దులు దాటిన వ‌య‌సున్న యంగ్‌స్ట‌ర్ హ‌ర్ష‌. త‌నకు స‌రైన జోడీని వెతుక్కుంటూ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఇండియాకు వ‌స్తాడు. అన్నీ అనుకున్న‌ట్టే జ‌రిగినా, పెళ్లికూతురు మాత్రం అత‌ని అభిరుచుల‌కు అనుగుణంగా దొర‌క‌దు. అలాంటి స‌మయంలో అత‌నికి విభ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. జీవితాన్ని ఆస్వాదించే హ్యాపీ గో ల‌క్కీ స్టాండ‌ప్ క‌మెడియన్ విభ‌. ఆమె ప‌రిచ‌యం అయ్యాక హ‌ర్ష‌, జీవితాన్ని చూసే తీరే మారిపోతుంది. ప్రేమ గురించి, బంధాల గురించి అప్ప‌టిదాకా అత‌ని మ‌న‌సులో ఉన్న అభిప్రాయాలు మారుతాయి. ఆధునిక జీవితంలో చాలా మంది ఫేస్ చేస్తున్న రిలేష‌న్‌షిప్ ఇష్యూస్‌ని సెన్సిటివ్‌గా డీల్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. అందులో వినోదం పాళ్లు కూడా ఎక్కువే. సంగీతం కూడా సినిమాకు అత్యంత పెద్ద ప్లస్ పాయింట్‌. ఆమ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాష్‌, గెట‌ప్ శీను, సుడిగాలి సుధీర్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

IFFI 202: అట్టహాసంగా ప్రారంభంకాబోతున్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’.. సల్మాన్‌తో సహా హాజరుకానున్న బాలీవుడ్‌ తారలు..

Sreemukhi: ట్రెండీ డ్రెస్‏లో అదిరిపోయిన శ్రీముఖి.. ఈ అందాల యాంకరమ్మకు సాటి లేరెవ్వరూ.!

Bhanu Shree: యాంకర్ భాను శ్రీ అందాల రచ్చ… స్టిల్స్ కి ఫిదా అవుతున్న ఫాన్స్..

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..