Mehreen Pirzada : ఆ హీరోతో చేయాలనంటే కోటి కావాల్సిందే.. ముద్దుగుమ్మ మెహరీన్ డిమాండ్ మామూలుగాలేదుగా..

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో హీరోయిన్‌‌గా పరిచయమైన అందాల భామ మెహరీన్ కౌర్.

Mehreen Pirzada : ఆ హీరోతో చేయాలనంటే కోటి కావాల్సిందే.. ముద్దుగుమ్మ మెహరీన్ డిమాండ్ మామూలుగాలేదుగా..
Mehreen
Follow us

|

Updated on: Nov 19, 2021 | 7:56 AM

Mehreen Pirzada : నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ మెహరీన్ కౌర్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరుమీదుంది. తాజాగా ఈ అమ్మడు నాగార్జున సినిమాలో ఛాన్స్ కోటేసిందని తెలుస్తుంది. ప్రవీణ్ సతార్ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గోస్ట్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో ముందుగా కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే కాజల్ వ్యక్తిగత కారణాల వల్ల సినిమానుంచి తప్పుకుందని తెలుస్తుంది. దాంతో ఆమె ప్లేస్‌లో మెహరీన్ ను ఎంపిక  చేయాలనీ చుస్తున్నారట.

అయితే ముందుగా అలమలాపాల్ ను హీరోయిన్ అనుకున్నారట .. ఆమెను సంప్రదించగా కోటి రూపాలకు పైగా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. దాంతో మెహరీన్ ను సంప్రదించారట.. ఆమె కూడా కోటి డిమాండ్ చేయడంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. నాగ్ వంటి సీనియర్ హీరోతో సినిమా చేస్తే ముందు ముందు కుర్ర హీరోల సినిమాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉండటంతో మెహరీన్ కోటి డిమాండ్ చేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం మెహరీన్ వెంకటేష్ , వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది. మెహరీన్ అడిగినంత ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Urfi Javed : బిగ్‌బాస్‌ నటి డ్రస్‌పై నెటిజన్ల విసుర్లు.. వార్డ్‌రోబ్‌ కలెక్షన్‌ చెత్తగా ఉందని ట్రోలింగ్‌..

Most Eligible Bachelor: ఆహా అందిస్తున్న అందమైన ప్రేమకథ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.. ఓటీటీకి వచ్చేసిన సినిమా

Bigg Boss 5 Telugu: రెచ్చిపోతున్నారు.. హద్దుమీరుతున్నారు.. ఆ ఇద్దరి పై నెటిజన్స్ ఫైర్.. కారణం ఇదే..