Bigg Boss 5 Telugu: రెచ్చిపోతున్నారు.. హద్దుమీరుతున్నారు.. ఆ ఇద్దరి పై నెటిజన్స్ ఫైర్.. కారణం ఇదే..

బిగ్ బాస్ హౌస్ లో అసలు ఏం జరుగుతుంది. అట కంటే అతి ఎక్కువగా జరుగుతుంది అని నెటిజన్లు అంటున్నారు. ఆ కామెంట్స్ కు తగ్గట్టుగానే హౌస్ లోఉన్న కంటెస్టెంట్స్ కూడా చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu: రెచ్చిపోతున్నారు.. హద్దుమీరుతున్నారు.. ఆ ఇద్దరి పై నెటిజన్స్ ఫైర్.. కారణం ఇదే..
Biggboss
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2021 | 7:07 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అసలు ఏం జరుగుతుంది. అట కంటే అతి ఎక్కువగా జరుగుతుంది అని నెటిజన్లు అంటున్నారు. ఆ కామెంట్స్ కు తగ్గట్టుగానే హౌస్ లోఉన్న కంటెస్టెంట్స్ కూడా చేస్తున్నారు. కావాలనే గొడవలు పడటం, ఏడవడం, అలగడం, మధ్య మధ్యలో హగ్గులు.. ఇలా ట్రోల్స్ చేసేవాళ్లకు కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సిరి, షణ్ముఖ్ పర్ఫామెన్స్ చేసిన నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో సన్నీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు షణ్ముఖ్. స్విమింగ్ పూల్ టాస్క్ లో టీషర్ట్ సరిగ్గా వేసుకోలేదు అన్నదానికి సన్నీ ఇంకా కోపంగానే ఉన్నాడు. నేను ఆడని అంటూ మధ్యలోనుంచే వెళ్ళిపోయాడు. దాంతో షణ్ముఖ్ ఎదో సలహా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆతర్వాత రవి అలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరయ్యి ఉంటారు.. షన్ను ఇచ్చిన సలహాతోనే అలా చేశాడా? అని అనుకుంటున్నానంటూ.. మానస్ దగ్గర చెప్పాడు సన్నీ.

ఇక బిగ్ బాస్ పవర్ ను రవికి ఇవ్వగా ఆ పవర్ ను సన్నీకి త్యాగం చేసాడు. ఆ పవర్ తో సన్నీ హెల్మెట్ సొంతం చేసుకుని గోల్డ్ మైన్ చేసేందుకు రెడీగా ఉన్న మానస్, ఆనీ, శ్రీరామచంద్రలోంచి.. శ్రీరామచంద్రను తప్పించాడు. ఆ ప్లేస్ లోకి సన్నీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరో వైపు సిరి షణ్ముఖ్ మళ్లీ గొడవపడుతూ కనిపించారు. ఐహేట్ యూ అంటూ టిష్యు పై లిప్స్టిక్ తో రాసి షణ్ముఖ్ పంపింది సిరి. దానికి ఐహేట్ యూ ఏంట్రా .. నేనేం చేశారా అంటూ అడిగాడు షణ్ముఖ్.. ఈ ఇద్దరి మధ్య ఏమైందో ఎవ్వరికి తెలియదు.. చూసే జనాలకు కూడా అర్ధంకావడం లేదు ఎందుకు గొడవపడుతున్నారో.. ఆతర్వాత వెంటనే సిరి షణ్ముఖ్ కు హగ్ ఇచ్చి ముద్దులు పెట్టేసింది. అసలు ఎందుకు గొడవపడ్డారు.. ఎందుకు హగ్గులు ఇచ్చుకున్నారు.. కావాలనే ఇలా చేస్తున్నారు.. హద్దులు మీరి రొమాన్స్ పండిస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఓ బెడ్డు మీద హగ్గులతో సిరి, షన్నులు రెచ్చిపోతుంటే.. మరో వైపు ఇంకో బెడ్డు మీద మానస్ –  ప్రియాంక లొల్లి జరిగింది. నన్ను కనీసం మనిషిలా చూడు.. అది చాలు అంతకంటే నేను ఎక్కువేమీ ఆశించడం లేదు అని ప్రియాంక తన బాధను మానస్ దగ్గర చెప్పుకుంది. ఇలా చూసే జనాలకు కూడా అర్ధంకాకుండా బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది.Bigg Boss

మరిన్ని ఇక్కడ చదవండి : 

IFFI 202: అట్టహాసంగా ప్రారంభంకాబోతున్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’.. సల్మాన్‌తో సహా హాజరుకానున్న బాలీవుడ్‌ తారలు..

Sreemukhi: ట్రెండీ డ్రెస్‏లో అదిరిపోయిన శ్రీముఖి.. ఈ అందాల యాంకరమ్మకు సాటి లేరెవ్వరూ.!

Bhanu Shree: యాంకర్ భాను శ్రీ అందాల రచ్చ… స్టిల్స్ కి ఫిదా అవుతున్న ఫాన్స్..