Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buchi Babu Sana : ఉప్పెన డైరెక్టర్ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చినట్టేనా.. ఆ స్టార్ హీరోతోనే బుచ్చిబాబు సినిమా..?

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు బుచ్చుబాబు సన. సుకుమార్ శిష్యుడిగా ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడిగా మారి ఉప్పెన అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

Buchi Babu Sana : ఉప్పెన డైరెక్టర్ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చినట్టేనా.. ఆ స్టార్ హీరోతోనే బుచ్చిబాబు సినిమా..?
Buchibabu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2021 | 6:41 AM

Buchi Babu Sana : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు బుచ్చుబాబు సన. సుకుమార్ శిష్యుడిగా ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడిగా మారి ఉప్పెన అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మెగా హీరో, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యారు. అలాగే హీరోయిన్ కృతిశెట్టి కూడా పరిచయం అయ్యింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా వందకోట్లకు పైగా వసూలు చేసింది. డెబ్యూ హీరో సినిమా వందకోట్లు సాధించడం నిజంగా రికార్డే.. ఆ రికార్డును వైష్ణవ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు ఎవరితో సినిమా చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

సుకుమార్‌కు తారక్‌కు మంచి స్నేహం ఉంది. అలాగే బుచ్చిబాబుకు కూడా తారక్‌తో మంచి చనువు ఉంది. ఈ క్రమంలో బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉంది అని ఆ మధ్య టాక్ వచ్చింది. ఇక బుచ్చిబాబు కూడా ఉప్పెన సినిమా తర్వాత తన సినిమాను అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం తారక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలు అయిపోయిన తర్వాత బుచ్చిబాబుతో సినిమా ఉంటుందని అంటున్నారు. ఇటీవల ఓ ఇంట్రవ్యూలో బుచ్చిబాబును మీ తర్వాత సినిమా తారక్ తోనేనా..? అని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. అదే సమయంలో ఓ పెద్ద హీరోతో సినిమా కోసం ఒక ప్రాంతీయ కథను సిద్దం చేసినట్లుగా కూడా బుచ్చి బాబు చెప్పాడు. దాంతో ఈ గుసగుసలు మరింత బలం చేకూరింది. తారక్ ఫ్యాన్స్ కు ఫిక్స్ అయ్యిపోయారు బుచ్చిబాబుతో సినిమా ఉంటుందని. చూడాలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

IFFI 202: అట్టహాసంగా ప్రారంభంకాబోతున్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’.. సల్మాన్‌తో సహా హాజరుకానున్న బాలీవుడ్‌ తారలు..

Sreemukhi: ట్రెండీ డ్రెస్‏లో అదిరిపోయిన శ్రీముఖి.. ఈ అందాల యాంకరమ్మకు సాటి లేరెవ్వరూ.!

Bhanu Shree: యాంకర్ భాను శ్రీ అందాల రచ్చ… స్టిల్స్ కి ఫిదా అవుతున్న ఫాన్స్..