IFFI 202: అట్టహాసంగా ప్రారంభంకాబోతున్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’.. సల్మాన్‌తో సహా హాజరుకానున్న బాలీవుడ్ తారలు..
IFFI 202: ఈ ఏడాది గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకి సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్,
IFFI 202: ఈ ఏడాది గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకి సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, శ్రద్ధా కపూర్, మౌని రాయ్, రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా వంటి చాలా మంది నటులు హాజరవుతారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభ వేడుకను మనీష్ పాల్, కరణ్ జోహార్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు దిలీప్ కుమార్, చిత్రనిర్మాతలు బుద్ధదేబ్ దాస్‌గుప్తా, సుమిత్రా భావేలకు నివాళులు అర్పిస్తారు. భారతీయ సినీ ప్రముఖులతో పాటు ఈ లోకాన్ని విడిచిపెట్టిన విదేశీ కళాకారులకు కూడా నివాళులర్పిస్తారు. వీరిలో క్రిస్టోఫర్ ప్లమ్మర్, బెర్ట్రాండ్ టావెర్నియర్, జేన్ పాల్ ఉన్నారు.
52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు గోవాలో జరగనుంది. కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రోగ్రామ్ ఫార్మాట్ హైబ్రిడ్‌గా రూపొందించారు. OTT ప్లాట్‌ఫామ్స్ కూడా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనవచ్చని భారత ప్రభుత్వం ప్రకటించింది. Zee5, Netflix, Amazon Prime Video వంటి ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఈ మెగా షోలో పాల్గొంటాయి. ఈ విషయాన్ని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
హేమమాలిని, ప్రసూన్ జోషికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈ వేడుకలో హేమమాలిని, ప్రసూన్ జోషిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించనున్నట్లు అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దశాబ్దాలుగా భారతీయ సినిమా రంగంలో హేమమాలిని, ప్రసూన్ జోషి అందించిన కృషి తరతరాలుగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. నివేదికల ప్రకారం 75 మంది యువ ఔత్సాహిక చిత్రనిర్మాతలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో పరిశ్రమ నిపుణుల నుంచి మాస్టర్ క్లాస్‌లను అందుకుంటారు. ఇది కాకుండా ఈ ఉత్సవంలో దాదాపు 50 సినిమాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి.
For the first time, OTT platforms will participate in the International Film Festival of India this year… Satyajit Ray Lifetime Achievement Award will be given to American filmmaker Martin Scorsese and Hungarian filmmaker Istvan Szabo: I&B Minister Anurag Thakur pic.twitter.com/7NHWuuTjUp
— ANI (@ANI) November 18, 2021