ఢిల్లీలో పంజా విప్పిన కాలుష్య భూతం.. ఇంట్లో కూడా ఊపిరి తీసుకోలేని పరిస్థితులు.. కారణాలు ఇలా..?
Pollution: ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. బయటి కాలుష్యంతో పాటు ఇండోర్ పొల్యూషన్ కూడా ప్రమాదకర స్థితికి చేరుకుంది.
Pollution: ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. బయటి కాలుష్యంతో పాటు ఇండోర్ పొల్యూషన్ కూడా ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో ఇళ్లలో ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంటి లోపల కాలుష్యం స్థాయి 60 నుంచి 70 మధ్య ఉండాలి కానీ ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. బయటి నుంచి వచ్చే విషపూరితమైన గాలి ఇంట్లోకి ప్రవేశిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇళ్లలో వంట చేసే సమయంలో ఎక్కువగా పొగ వస్తుంది.
విద్యుత్ ఉపకరణాల నుంచి వెలువడే గ్యాస్ కూడా కాలుష్యానికి కారణమవుతుంది. ఈ కారణాల వల్ల ఇండోర్ పొల్యూషన్ స్థాయి పెరిగిపోతుంది. బయట కాలుష్యం స్థాయి 300 ఉంటే ఇంటి లోపల 200 వరకు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. దీనిని నివారించడానికి ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి కాలుష్యం కిటికీలు, దర్వాజల గుండా ఇంట్లోకి వెళుతుంది. దీని కోసం ఎక్కువసేపు కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. లోపల గాలిని శుభ్రం చేయడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలు లేదా వృద్ధులు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మోకర్లు ఇంట్లో అస్సలు పొగ తాగకూడదు.
ఇంట్లో మొక్కలు పెంచండి ఇంటిలో పొల్యూషన్ తగ్గాలంటే ఇంట్లో చిన్న చిన్న మొక్కలను పెంచాలి. ఎందుకంటే ఈ మొక్కలు ఆక్సిజన్‌ను విడుదల చేసి గాలిని శుభ్రపరుస్తాయి. అందువల్ల ఇంటి అలంకరణలో ఎక్కువ మొక్కలను చేర్చండి. ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్, బ్యాటరీ, ఓవెన్ వంటి వస్తువులు ఎప్పుడు మూసి ఉన్న గదిలో ఉంచకూడదు. ఈ పరికరాలను కిటికీ దగ్గర లేదా వాటి గాలి బయటికి వెళ్లే ప్రదేశంలో ఉంచాలి. కొన్నిసార్లు ఇంటి కర్టెన్లు, కార్పెట్‌లపై దుమ్ము కణాలు పేరుకుపోతాయి. ఈ కణాలు ప్రజలకు అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ఇవే కాకుండా బెడ్, సోఫాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి.