- Telugu News Photo Gallery Viral photos 6 year old girl has the worlds largest collection of lip balms see pictures
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Viral Photos: హాంకాంగ్‌కు చెందిన స్కార్లెట్ ఆష్లే చెంగ్ అనే 6 ఏళ్ల బాలికకు లిప్ బామ్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే ఇంట్లోనే షాప్ పెట్టుకునేంత.
Updated on: Nov 17, 2021 | 10:23 PM

హాంకాంగ్‌కు చెందిన స్కార్లెట్ ఆష్లే చెంగ్ అనే 6 ఏళ్ల బాలికకు లిప్ బామ్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే ఇంట్లోనే షాప్ పెట్టుకునేంత. ఆమె వింత హాబీ ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

ఆమె తన అక్క కాలిన్‌తో కలిసి ఈ లిప్ బామ్‌లను సేకరిస్తుంది. ఇప్పుడు ఆమె దగ్గర దాదాపు 3,888 లిప్ బామ్‌లు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

చిన్నప్పుడు పెదవులు ఎండిపోవడంతో అక్కలిద్దరికీ అమ్మమ్మ లిప్ బామ్ గురించి చెప్పింది. ప్రతిరోజూ పెదవులకు లిప్ బామ్ అప్లై చేసేదని స్కార్లెట్ చెప్పింది. కొంతకాలం తర్వాత ఈ లిప్ బామ్‌లు విభిన్న రుచులలో రావడం ప్రారంభించాయి.

ఇప్పుడు లిప్ బామ్‌లు కొనడం హాబీగా మారిందని స్కార్లెట్ ఆష్లే చెంగ్ చెప్పింది. సోదరీమణులిద్దరూ అందమైన లిప్ బామ్‌లను సేకరించడం మొదలెట్టారు.

స్కార్లెట్ 3,888 లిప్ బామ్‌లను కలిగి ఉంది. వీటిలో స్కిటిల్స్, చుపా చుప్స్ బ్రాండ్‌లు, అలాగే కోకా కోలా, ఫాంటా ఫ్లేవర్ బామ్‌లు ఉన్నాయి.





























