Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రాష్ట్ర రైతులకు పెద్ద ఊరట.. 4000 కోట్ల రూపాయల విద్యుత్‌ బిల్లు మాఫీ..!

Maharashtra: మహారాష్ట్ర రైతులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది. 12 లక్షల రైతులకి సంబంధించిన 4000 కోట్ల విద్యుత్‌ బకాయిలను మాఫీ చేస్తామని

ఆ రాష్ట్ర రైతులకు పెద్ద ఊరట.. 4000 కోట్ల రూపాయల విద్యుత్‌ బిల్లు మాఫీ..!
Farmers Electricity
Follow us
uppula Raju

|

Updated on: Nov 18, 2021 | 6:00 AM

Maharashtra: మహారాష్ట్ర రైతులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది. 12 లక్షల రైతులకి సంబంధించిన 4000 కోట్ల విద్యుత్‌ బకాయిలను మాఫీ చేస్తామని రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ఆఫర్ ప్రకటించింది. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (MSEDCL) ఒక ప్రకటన ప్రకారం.. పశ్చిమ మహారాష్ట్ర రైతులు 8007 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు బకాయి ఉందని తెలిపింది. రైతులు తమ బకాయి బిల్లులు చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ కింద రైతులు రూ.8007 కోట్లలో సగం అంటే రూ.4007 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఆఫర్‌ని అంగీకరిస్తే రైతులు సగం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బిల్లు పొలాల దగ్గర ఉండే బావులకి సంబంధించినవి. ఇప్పటివరకు పశ్చిమ మహారాష్ట్రలోని 5.52 లక్షల మంది రైతులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నారు. వారు బకాయి ఉన్న విద్యుత్ బిల్లులను చెల్లించారు. 409 కోట్ల బకాయిలపై మొత్తం రూ.359 కోట్లు డిపాజిట్ చేశారు.బిల్లు చెల్లింపులో బారామతి సర్కిల్‌ అగ్రస్థానంలో ఉందని విద్యుత్‌ సంస్థ తెలిపింది. ఇక్కడ మొత్తం 3.76 లక్షల బిల్లులు జమయ్యాయని తెలిపింది. అదే సమయంలో కొల్లాపూర్ సర్కిల్ పరిధిలో 1.42 లక్షల బిల్లులను రైతులు డిపాజిట్ చేశారు. పుణె సర్కిల్‌లోని మొత్తం 32 వేల 683 మంది రైతులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నారు.

ఇటీవల MSEDCL కంపెనీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సకాలంలో బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు బకాయి బిల్లులు చెల్లించని రైతుల కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేస్తామని కంపెనీ హెచ్చరించింది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రైతుల విద్యుత్ బిల్లు బకాయిలపై వడ్డీ, ఆలస్య రుసుమును మాఫీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం రైతులు పాత బిల్లులు చెల్లిస్తే 66 శాతం వరకు రాయితీ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి పాత బిల్లులను చెల్లించాల్సి రావడంతో రైతులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే కంపెనీ హెచ్చరికతో ఇప్పుడు చెల్లించడం మొదలుపెట్టారు.

విటమిన్‌ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం