Bank Star Series Notes: మీ దగ్గర స్టార్ సిరీస్ నోట్లు ఉన్నాయా.. అయితే వాటి ప్రత్యేకతేంటో తెలుసుకోండి..
ఒక రూపాయి నోటు కాకుండా అన్నీ రకాల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముద్రిస్తుంది. దేశంలోని ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నోట్లను ముద్రిస్తుంది.

ఒక రూపాయి నోటు కాకుండా అన్నీ రకాల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముద్రిస్తుంది. దేశంలోని ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నోట్లను ముద్రిస్తుంది. ముద్రించే ప్రతి నోటుకు ఒక ప్రత్యేక గుర్తింపు నంబరుతో పాటు అనేక రకాల కొన్ని గుర్తులను కేటాయిస్తుంది. వీటి ద్వారానే ఆ నోటు నిజమైనదా లేదా నకిలీదా అని గుర్తించవచ్చు. ఈక్రమంలో కొంతమంది జనాలు వారి అభిరుచల మేరకు నోట్లను ఖర్చు చేయకుండా పదిలంగా దాచుకుంటుంటారు. మరికొంతమందికి వివిధ రకాల నోట్లను కలెక్ట్ చేయడం హాబీగా ఉంటుంది. అయితే వివిధ రకాల నంబర్లు, గుర్తులు కలిగిన నోట్లను అందరూ చూసి ఉంటారు. కానీ స్టార్ సిరీస్ నోట్లను మాత్రం చాలా తక్కువ మంది చూసి ఉంటారు. ఎందుకంటే ఇవి అరుదైనవి. ఆర్బీఐ చాలా పరిమిత సంఖ్యలో ఈ స్టార్ సిరీస్ నోట్లను ముద్రిస్తుంది. మరి ఈ నోట్ల ప్రత్యేకతేంటో ఓసారి తెలుసుకుందాం రండి.
దేశంలోని ప్రజల నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఆర్బీఐ ప్రత్యేక నంబర్లు, గుర్తులతో నోట్లను ముద్రిస్తోంది. అందులో భాగంగానే 2006 నుంచి ఆర్బీఐ స్టార్ సిరీస్ నోట్లను ముద్రిస్తోంది. పరిమిత సంఖ్యలో వీటిని ముద్రించడం వల్ల ఆర్బీఐ వీటిని స్పెషల్ నోట్లుగా పరిగణిస్తోంది. ఇతర నోట్లతో కలిపి కాకుండా ఆర్బీఐ ప్రత్యేకంగా ఈ నోట్లను తయారుచేస్తుంది. ఇక స్టార్ సిరీస్‌లో ఎక్కువగా ఉండేది 100 రూపాయల నోట్లే. ఇవి చూడడానికి సాధారణ నోట్ల మాదరిగానే కనిపిస్తుంటాయి. కానీ సెక్యూరిటీ ఫీచర్లలో భాగంగా కేటాయించిన నంబర్ మధ్యలో ఒక నక్షత్రం గుర్తు ఉంటుంది. ఉదాహరణకు సాధారణ నోట్‌పై 4CC 456917 అంకెలు ఉంటే, స్టార్ సిరీస్ నోట్‌పై మాత్రం 4CC * 456917 అని ఉంటుంది. ఆర్బీఐ ఎంతో స్పెషల్‌గా పరిగణించే ఈ నోట్లను సేకరించడం చాలామంది హాబీగా మలుచుకున్నారు. అదేవిధంగా పాత వస్తువులను విక్రయించే వెబ్‌సైట్లు, వాటిని సేకరించే వారి వద్ద కూడా ఈ నోట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
Also Read:
Kulbhushan Jadhav: కుల్‌భూషణ్ జాదవ్‌కు స్వల్ప ఊరట.. పాక్‌ను ఆదేశించిన ఇంటర్నేషనల్ కోర్టు
S 400: అమెరికాతో నై.. రష్యాతో సై.. భారత అమ్ములపొదిలో అద్భుత అస్త్రం..