AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kulbhushan Jadhav: కుల్‌భూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట.. పాక్‌‌ను ఆదేశించిన ఇంటర్నేషనల్‌ కోర్టు

పాక్‌ జైల్లో మగ్గుతున్న భారతీయ ఖైదీ కుల్‌భూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట లభించింది. గూఢచర్యం కేసులో పాక్‌ కోర్టు విధించిన ఉరిశిక్షపై అప్పీల్‌కు వెళ్లేందుకు కుల్‌భూషణ్‌కు..

Kulbhushan Jadhav: కుల్‌భూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట.. పాక్‌‌ను ఆదేశించిన ఇంటర్నేషనల్‌ కోర్టు
Kulbhushan Jadhav
Sanjay Kasula
|

Updated on: Nov 17, 2021 | 8:36 PM

Share

పాక్‌ జైల్లో మగ్గుతున్న భారతీయ ఖైదీ కుల్‌భూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట లభించింది. గూఢచర్యం కేసులో పాక్‌ కోర్టు విధించిన ఉరిశిక్షపై అప్పీల్‌కు వెళ్లేందుకు కుల్‌భూషణ్‌కు అనుమతి లభించింది, అంతర్జాతీయ న్యాయస్థానం ఒత్తిళ్లతో పాకిస్తాన్‌ పార్లమెంట్‌ దీనిపై చట్టం చేసింది. కుల్‌భూషణ్‌కు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఇంటర్నేషనల్‌ కోర్టు పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కుల్‌భూషణ్ జాదవ్‌ అప్పీల్‌కు వెళ్లేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం 2020 లోనే పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీనిపై పాక్‌ విపక్షాలు నానా హంగామా చేశాయి.

భారత నావికాదళంలో ఆఫీసర్‌గా పనిచేసిన కుల్‌భూషణ్‌ను ఇరాన్‌ సరిహద్దులో పాకిస్తాన్‌ అక్కమంగా నిర్భంధించింది. వ్యాపార పనుల మీద అక్కడికి వెళ్లిన కుల్‌భూషణ్‌పై పాక్‌ ప్రభుత్వం గూఢచర్యం ఆరోపణలను మోపింది. అయతే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది.

పాకిస్తాన్‌ కోర్టు 2017లో కుల్‌భూషణ్‌ జాదవ్‌కు ఉరిశిక్ష విధించింది. గూఢచర్యంతో పాటు ఆయనపై ఉగ్రవాదిగా ముద్ర వేశారు పాకిస్తాన్‌ అధికారులు. పాక్‌ కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఇవి కూడా చదవండి: Air pollution: ఉద్యోగులు ప్రజా రవాణాను వినియోగించండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..

PM Narendra Modi: ఈనెల 19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..