PM Narendra Modi: ఈనెల 19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..
PM Narendra Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను
PM Narendra Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 2: 45 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్, రతౌలీ వీర్ ప్రాజెక్ట్, భయోని డ్యామ్ ప్రాజెక్ట్, మజ్‌గావ్-చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 3,250 కోట్లు కాగా, ఈ ప్రాజెక్టుల వల్ల మహోబా, హమీర్‌పూర్, బండ, లలిత్‌పూర్ జిల్లాల్లోని దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. తద్వారా లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతారు. ఈ ప్రాంతానికి త్రాగునీటి సమస్య కూడా తీరిపోతుందన్నారు.
ఆ తరువాత సాయంత్రం 5:15 గంటలకు ఝాన్సీలోని గరౌత్‌లో 600 మెగావాట్ల అల్ట్రామెగా సోలార్ పవర్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ. 3000 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. చవకైన విద్యుత్, గ్రిడ్ స్థిరత్వం వంటి బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఝాన్సీలో అటల్ ఏక్తా పార్కును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీదుగా దాదాపు 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 11 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పార్క్‌ను నిర్మించారు. ఇందులో లైబ్రరీతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహం కూడా ఉంటుంది. ప్రఖ్యాత శిల్పి శ్రీ రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని నిర్మించారు.
Also read:
Cryptocurrency: క్రిప్టోకరెన్సీ లావాదేవీలను నిషేధించవచ్చు.. త్వరలో కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
Good News: తెలంగాణలోని ఆ ప్రభుత్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే పీఆర్సీ అమలు