Crime News: గాలి నింపుతుండగా పేలిన ట్రాక్టర్ టైర్.. ఎగిరిపడిన బాలుడు.. విరిగిన చేతులు
Crime News: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గాలి నింపుతున్న ట్రాక్టర్ టైరు పేలడంతో బాలుడి రెండు చేతులు విరిగిపోయి, తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి
Crime News: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గాలి నింపుతున్న ట్రాక్టర్ టైరు పేలడంతో బాలుడి రెండు చేతులు విరిగిపోయి, తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నీలగిరి ప్రాంతంలోని మాన్‌గర్ వద్ద ఉన్న పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఒక బాలుడు ట్రాక్టర్ చక్రాలలో గాలిని నింపడం ప్రారంభించాడు. అయితే ఒత్తిడి ఎక్కువ కావడంతో టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పక్కనే ఉన్న బాలుడు 10-12 అడుగుల పైకి ఎగరి కిందపడ్డాడు.
ఈ ప్రమాదంలో బాలుడి రెండు చేతులు విరిగిపోయాయి. తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే అతడిని దగ్గరలో ఉన్న నీలగిరి ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో జిల్లా పెద్దాస్పత్రికి తరలించారు. కాగా గాయపడిన బాలుడు జార్ఖండ్ వాసి అని తేలింది. అతడు పంచలింగేశ్వర్ ప్రాంతంలోని ఇటుకబట్టీలో పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఇటుక బట్టీలలో చాలామంది మైనర్ పిల్లలు పనిచేస్తున్నారని స్థానిక యంత్రాంగం ఇటుక బట్టీల యజమానిపై చర్యలు తీసుకొని పిల్లలను రక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రమాదంలో గాయపడిన బాలుడిని చూసి స్థానికులు చలించిపోయారు. అందుకే ఎప్పుడైనా కాని వాహనాల టైర్లలో గాలినింపుతుండగా దూరంగా ఉండటం మంచిది. ఎందుకు టైర్ పీడనం వల్ల ఒత్తిడికి లోనవుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పేలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా ఒక్కోసారి వాహనాలు రన్నింగ్‌లో ఉన్నప్పుడు కూడా టైర్లు పేలిపోతుంటాయి. ఇలాంటి సమయంలో చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి.