AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?

Crime News: బిహార్‌లోని మధుబని జిల్లా ఝంజర్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు ఏకంగా జడ్జిపైనే దాడికి పాల్పడ్డారు. అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి (ASJ) గురువారం

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?
Judge Attacked
uppula Raju
|

Updated on: Nov 18, 2021 | 11:06 PM

Share

Crime News: బిహార్‌లోని మధుబని జిల్లా ఝంజర్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు ఏకంగా జడ్జిపైనే దాడికి పాల్పడ్డారు. అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి (ASJ) గురువారం విచారణ మధ్యలో ఉన్నప్పుడు ఇద్దరు పోలీసు అధికారులు అతడిపై దాడి చేశారు. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఘోఘర్దిహ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గోపాల్ ప్రసాద్, సబ్-ఇన్‌స్పెక్టర్ అభిమన్యు కుమార్ ఇద్దరూ ఒక కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

వారు కోర్టు గదిలోకి ప్రవేశించినప్పుడు జడ్జి అవినాష్ కుమార్‌ తలపై తుపాకి గురిపెట్టి, దాడికి తెగబడ్డారు. అంతేకాదు న్యాయమూర్తిని రక్షించేందుకు జోక్యం చేసుకున్న పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని కూడా వారు విచక్షణ రహితంగా గాయపరిచారు. మీడియా కథనాల ప్రకారం న్యాయమూర్తి అవినాష్ కుమార్ తన తీర్పుల కారణంగా నిత్యం వార్తల్లో నిలిచేవారు. చాలా సందర్భాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. చాలా సందర్భాల్లో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ని హెచ్చరించారు.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని వారు ఇలా చేసి ఉంటారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనను బార్ అసోసియేషన్ ఝంఝార్‌పూర్ వైస్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. ఇది న్యాయ వ్యవస్థను అణిచివేసే ప్రయత్నం అన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌పై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై ఎలాంటి నిర్ణయం వెలువుడుతుందో వేచి చూడాలి.

Crime News: గాలి నింపుతుండగా పేలిన ట్రాక్టర్‌ టైర్‌.. ఎగిరిపడిన బాలుడు.. విరిగిన చేతులు

Indian Railway: అలసిపోయిన ప్రయాణికుల కోసం కొత్త సేవలు.. విశ్రాంతి తీసుకోవడానికి వీటి ఏర్పాటు..

ఢిల్లీలో పంజా విప్పిన కాలుష్య భూతం.. ఇంట్లో కూడా ఊపిరి తీసుకోలేని పరిస్థితులు.. కారణాలు ఇలా..?