AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు.. ఏడాదిగా లైంగికంగా వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు..

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లా గోగుండా బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్‌ భీల్‌పై రెండోసారి అత్యాచారం కేసు నమోదైంది. రెండు సందర్భాల్లోనూ ఎమ్మెల్యే పెళ్లి, ఉద్యోగం సాకుతో మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి...

Rajasthan: బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు.. ఏడాదిగా లైంగికంగా వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు..
Pratap
Srinivas Chekkilla
|

Updated on: Nov 19, 2021 | 7:52 AM

Share

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లా గోగుండా బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్‌ భీల్‌పై రెండోసారి అత్యాచారం కేసు నమోదైంది. రెండు సందర్భాల్లోనూ ఎమ్మెల్యే పెళ్లి, ఉద్యోగం సాకుతో మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి కేసు నమోదైంది. ఉదయ్‌పూర్ నగరంలోని అంబమత పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రతాప్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. గత రెండేళ్లుగా ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల ఉప ఎన్నికల తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, ఆ తర్వాత ఎమ్మెల్యే తనను బెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఎమ్మెల్యే ప్రైవేట్ సిబ్బంది కూడా తనను బెదిరించారని బాధితురాలు ఆరోపించింది.

ఎమ్మెల్యేకు కేసు కావడంతో బాధితురాలికి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తును సీఐడీ క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. అయితే ఎమ్మెల్యే ఆరోపణలను ఖండించారు. బాధితురాలు తనకు తెలియదని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగం, పెళ్లి సాకుతో ఎమ్మెల్యేపై అత్యాచారానికి పాల్పడ్డారని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఆరోపించడంతో ఎమ్మెల్యేపై ఇదే తరహా కేసు నమోదు కావడం గమనార్హం. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. అత్యాచారం ఆరోపణలు రావటంతో బీజేపీపై కాంగ్రెస్, ఇతర పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Read Also.. Most Used Passwords: ఇలాంటి పాస్‌వర్డ్‌లు పెడితే ‘ఫసక్’.. భారతీయులంతా అలాంటి పదాలనే వాడుతున్నారంట..!

Smart Policing: స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ నెంబ‌ర్ వ‌న్‌.. తెలంగాణ పోలీసులు ఎక్కడున్నారో తెలుసా..

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?

మందుబాబులకు హెచ్చరిక.. అక్కడ రెండు డోసుల టీకా వేసుకుంటేనే మద్యం..