మందుబాబులకు హెచ్చరిక.. అక్కడ రెండు డోసుల టీకా వేసుకుంటేనే మద్యం..
Madhya Ppradesh: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ టీకాను పెంచే ప్రయత్నంలో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న
Madhya Ppradesh: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ టీకాను పెంచే ప్రయత్నంలో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే మద్యం అమ్ముతామని తెలిపింది. టీకా వేసుకోని వారికి మద్యం పంపిణీ ఉండదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 74 మద్యం దుకాణాలకు నిబంధనలను జారీ చేసింది. రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నందున టీకా గురించి అవగాహన పెంచడానికి, ప్రజలను ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలియజేశారు.
అంతకుముందు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం టీకాలను పెంచడానికి ప్రజలకు షరతు విధించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రేషన్ షాపుల్లో ప్రయోజనాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండాలని తెలిపింది. ఈ విషయాన్ని సదరు రేషన్ డీలర్ తనిఖీ చేయాలని నిబంధనలు జారీ చేసింది. ఒకవేళ వినియోగదారుడు టీకా వేసుకోకుంటే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి వేసుకోని వచ్చిన తర్వాతే సరుకులు అందించాలని పేర్కొంది. డిసెంబర్ 31 నాటికి దేశంలోని మొత్తం జనాభాకు కనీసం కోవిడ్ టీకా మొదటి డోస్ పూర్తి కావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రం జనాభాలో సగం మందికి పైగా కరోనా రెండు డోసుల టీకాలు పొందరాని తెలిపారు. డిసెంబర్ 25 లోపు అర్హులైన జనాభాకు పూర్తిగా టీకాలు వేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. 5.59 కోట్ల మంది అర్హులైన జనాభాను కలిగి ఉన్న మధ్యప్రదేశ్ కనీసం 27,543,593 మంది లబ్ధిదారులకు రెండు డోసుల వ్యాక్సిన్‌లను అందించింది. ఈ ఘనత సాధించినందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో డిసెంబర్ 25లోపు రాష్ట్రంలో అర్హులైన వారికి పూర్తి స్థాయిలో టీకాలు వేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Alcohol will be sold at the liquor stores to only those people who have received both doses of COVID vaccine: Khandwa District Excise Officer #MadhyaPradesh pic.twitter.com/CoCqiITgsN
— ANI (@ANI) November 18, 2021