AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: రాజస్థాన్‎లో ఘోరం.. మహిళను జేసీబీతో ఢీకొట్టేందుకు యత్నం.. వైరలైన వీడియో..

రాజస్థాన్‎లో ఓ మహిళను జేసీబీతో ఢీకొట్టేందుకు యత్నంచారు కొందరు దుండగులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బార్మర్ జిల్లాలో JCB యంత్రం మహిళపైకి వస్తుంటే ఆమె రాళ్లుతో జేసీబీపై దాడి చేసింది...

Viral video: రాజస్థాన్‎లో ఘోరం.. మహిళను జేసీబీతో ఢీకొట్టేందుకు యత్నం.. వైరలైన వీడియో..
Rajastan
Srinivas Chekkilla
|

Updated on: Nov 19, 2021 | 12:10 PM

Share

రాజస్థాన్‎లో ఓ మహిళను జేసీబీతో ఢీకొట్టేందుకు యత్నంచారు కొందరు దుండగులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బార్మర్ జిల్లాలో JCB యంత్రం మహిళపైకి వస్తుంటే ఆమె రాళ్లుతో జేసీబీపై దాడి చేసింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజస్థాన్‌లో మహిళలకు భద్రత లేదని బీజేపీ ఆరోపించింది. అయితే భూమి విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. “భూ వివాదంపై రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ వీడియో. ఈ అంశంపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ఇది దర్యాప్తులో ఉంది.” అని బార్మర్ ఎస్పీ దీపక్ భార్గవ్ తెలిపారు. మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసింది.

“ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ తన ‘లడ్కీ హూన్ లడ్ శక్తి హూన్’ నినాదంతో ప్రజలను మోసం చేస్తుంటే, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో, ఈ రోజు ఒక ఒంటరి మహిళపై పట్టపగలు ఎటువంటి భయం లేని పోకిరీలు భౌతికంగా దాడి చేశారు. చట్టం!!” అని బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయని రాజస్థాన్ ఎంపీ రాజవర్ధన్ రాథోడ్ అన్నారు. “ఇప్పుడు రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయి.

రాజస్థాన్‌లో తీవ్రమైన నేరాలు అనూహ్యంగా పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ డేటా కూడా నిర్ధారిస్తోంది. కానీ, రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మౌనంగా కూర్చుంటోందని విమర్శించారు. వారు కుర్చీ గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారని ప్రజల గురించి కాదని ఆరోపించారు. నవంబర్ 13న ఈ ఘటన జరగ్గా వీడియో వైరల్ అయిన తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Read Also.. మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. అమెరికన్ ఫుడ్ కంపెనీ సన్నాహాలు.. వీడియో