Most Used Passwords: ఇలాంటి పాస్‌వర్డ్‌లు పెడితే ‘ఫసక్’.. భారతీయులంతా అలాంటి పదాలనే వాడుతున్నారంట..!

రొమాంటిక్ పదాలతో కూడిన పాస్‌వర్డ్‌లు మహిళలు ఎక్కువగా వాడుతున్నట్లు రిపోర్టులో తేలింది. దేశంలోని ప్రముఖల పేర్లతో కూడిన పాస్‌వర్డ్‌లు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇందులో

Most Used Passwords: ఇలాంటి పాస్‌వర్డ్‌లు పెడితే 'ఫసక్'.. భారతీయులంతా అలాంటి పదాలనే వాడుతున్నారంట..!
Password
Follow us
Venkata Chari

|

Updated on: Nov 18, 2021 | 6:25 PM

India Most Used Password List 2021: భారతీయులు ఎక్కువగా ‘123456’ లాంటి పాస్‌వర్డ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే విషయం తరచుగా వినిపిస్తూనే ఉంది. కానీ, ఇలాంటివి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘పాస్‌వర్డ్’ అని ఒక పరిశోధన వెల్లడించింది. అదే సమయంలో టెక్నాలజీ పరంగా భారత్‌ దూసుకెళ్తున్నా, పాస్‌వర్డ్ విషయంలో మాత్రం వెనుకంజలోనే నిలిచింది. అయతే జపాన్ మాత్రం అత్యధిక రక్షణ కలిగిన పాస్‌వర్డ్‌లను ఏర్పరుచుకుంటున్నారని పరిశోధనలో తెలిసింది.

iloveyou, omsairam అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లు.. దేశంలోని ప్రజలు ఉపయోగించే అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లలో ‘iloveyou’, ‘krishna’, ‘sairam’, ‘omsairam’ ఉన్నాయి. నార్డ్‌పాస్ పరిశోధనలో ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వెబ్‌సైట్ పాస్‌వర్డ్‌లను ఎలా పెట్టుకోవాలో వినియోగదారులకు సహాయపడుతుంది. ప్రేమ పేర్లు భారతీయులు ఎక్కువగా వాడుతున్న తేలింది. అదే సమయంలో india123, abc123, 123456789, 12345678, 123123, qwerty, xxx, Indya123, abcd1234, 1qaz@WSX, 1qaz లాంటి కూడా ఉన్నాయంట.

రొమాంటిక్ పదాల పాస్‌వర్డ్‌లు.. రొమాంటిక్ పదాలతో కూడిన పాస్‌వర్డ్‌లు మహిళలు ఎక్కువగా వాడుతున్నట్లు రిపోర్టులో తేలింది. దేశంలోని ప్రముఖల పేర్లతో కూడిన పాస్‌వర్డ్‌లు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇందులో ‘ప్రియాంక’, ‘సంజయ్’, ‘రాకేష్’ వంటి పేర్లు కూడా ఉన్నాయి. ‘iloveyou’, ‘స్వీట్‌హార్ట్’, ‘లవ్లీ’, ‘సన్‌షైన్’ వంటి పాస్‌వర్డ్‌లను తమ అకౌంట్లకు వాడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ఈ పాస్‌వర్డ్‌లు మహిళలే ఎక్కువగా వాడుతున్నట్లు తేలింది.

ఈ పాస్‌వర్డ్‌లు సెకనులో హ్యాక్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయని, అత్యంత ప్రాచుర్యం పొందిన పాస్‌వర్డ్‌లు హ్యాక్ చేయడానికి సులభమైనవని పరిశోధనలో వెల్లడైంది. మొత్తంమీద భారత్‌లో ఉపయోగించే 200 పాస్‌వర్డ్‌లు 62 సెకనులోపు హ్యాక్ చేసేందుకు అనుకూలంగా ఉన్నాయంట.

పాస్‌వర్డ్‌ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి.. జీమెయిల్ నుంచి బ్యాంక్, యూపీఐ లావాదేవీల వరకు, కనీసం ఒక పాస్‌వర్డ్ అవసరం. వినియోగదారులు కనీసం 12 నుంచి 18 పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాలి. అందుకే చాలా మంది పాస్‌వర్డ్‌లను సులభంగా తయారు చేసుకుంటారు. తేలికగా గుర్తుండే పదాలను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే మాత్రం హ్యాక్ చేయబడే అవకాశాలు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సురక్షితమైన పాస్‌వర్డ్‌ను రూపొందించడంలో ఎలాంటి తప్పులను నివారించాలో తెలుసుకుందాం..

-పాస్‌వర్డ్‌లో కనీసం 10 నుంచి 15 అక్షరాలను ఉపయోగించండి. -వర్ణమాల ఉన్న సంఖ్యలను కూడా ఉపయోగించండి. -పాస్‌వర్డ్‌లో ఆల్ఫాబెటిక్ క్యాపిటల్‌ని ఉంచండి. -అలాగే స్పెషల్ క్యారెక్టర్లు @, #, $, %, ^, &, * ని కూడా ఉపయోగించండి. -మీ పాస్‌వర్డ్‌ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. -సాధ్యమైన చోట, ఓటీపీతో పాస్‌వర్డ్‌ను లింక్ చేసుకోవడం మంచింది.

పాస్‌వర్డ్ తయారీలో చేయకూడని తప్పులు ఏమిటి? -సాధారణ పదాలతో పాస్‌వర్డ్‌లను పెట్టుకోవద్దు. -పాస్‌వర్డ్‌లో 8 కంటే తక్కువ అక్షరాలను ఉపయోగించవద్దు. -పాస్‌వర్డ్‌లో మీ పేరు, పుట్టిన తేదీని ఉపయోగించవద్దు. -మీ పేరును పాస్‌వర్డ్‌గా పెట్టుకోకూడదు. -మీ పాస్‌వర్డ్‌ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు.

పాస్‌వర్డ్‌కు బదులుగా పాస్‌ఫ్రేజ్‌ని ఉపయోగించడం ద్వారా మీ డేటా, అకౌంట్‌ను రక్షించుకోవచ్చు. ఇతర పాస్‌వర్డ్‌లతో పోలిస్తే, వీటిని ఏర్పరచుకోవడం చాలా సులభం. కానీ, క్రాక్ చేయడం మాత్రం చాలా కష్టం. మీరు ఉంటున్న సిటీతో పాటు, facebook లోని మొదటి పదం, జీమెయిల్‌ మొదటి పదం వాడి ఆయా అకౌంట్లకు పాస్‌వర్డ్‌‌లను పెట్టుకుంటే చాలా భద్రంగా ఉంటాయి. అలాగే అవి ఏ అకౌంట్లవో కూడా చాలా తేలికగా గుర్తుంచుకోవచ్చు .ఇందులో మీ పుట్టిన తేదీ లేదా సంవత్సరం కూడా ఉంచుకోవచ్చు. ఇలాంటి పాస్‌వర్డ్‌లను తయారు చేసుకుంటే మన డేటాతో పాటు అకౌంట్లను కూడా చాలా సేఫ్‌గా ఉంచుకోవచ్చు.

Also Read: Google Pay: గూగుల్‌పేలో మరో అదిరిపోయే కొత్త ఫీచర్‌.. మీ వాయిస్‌తో డబ్బులు ఖాతాకు బదిలీ..!

First Beach: 330 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన బీచ్.. ప్రపంచంలోనే మొదటి బీచ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా..