First Beach: 330 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన బీచ్.. ప్రపంచంలోనే మొదటి బీచ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా..

World First Beach: సృష్టిలోని ఎన్నో వింతలు విశేషాలున్నాయి. కొన్ని కొన్ని తెలిసినట్లు ఉంటాయి.. అయితే వాటిని తరచి చూస్తే మళ్ళీ ఇంకొక ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. భూమి, ఆకాశం నీరు..

First Beach: 330 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన బీచ్.. ప్రపంచంలోనే మొదటి బీచ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా..
Singhbhum Region Of Jharkha
Follow us
Surya Kala

|

Updated on: Nov 18, 2021 | 9:42 AM

World First Beach: సృష్టిలోని ఎన్నో వింతలు విశేషాలున్నాయి. కొన్ని కొన్ని తెలిసినట్లు ఉంటాయి.. అయితే వాటిని తరచి చూస్తే మళ్ళీ ఇంకొక ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. భూమి, ఆకాశం నీరు, గాలి ఇలా అన్నిటిలోనూ ఇప్పటికీ చేధించని మిస్టరీలు ఎన్నో.. అయితే ప్రపచంలో సముద్ర తీరం ఎప్పడు ఏర్పడిందంనేది శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపపంచంలోని మొట్టమొదటి సముద్ర తీర ప్రాంతం మన భారతదేశంలోనే ఏర్పడింది. అది జార్ఖండ్‌లోని సింఘ్‌భూమ్‌లో ఏర్పడినట్లుగా పరిశోధకులు తేల్చి చెప్పారు. దాదాపు 330 కోట్ల సంవత్సరాల కిందట ఇది ఏర్పడి ఉంటుందని ఇండియా, ఆస్ట్రేలియా, యూఎస్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది.

సముద్ర మట్టానికి పైన దాదాపు 330 కోట్ల సంవత్సరాల క్రితం ఈ స్థిరమైన ఖండాంతర భూభాగాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తిం చారు. అగ్నిపర్వతాల నుంచి విడుదలైన తేలికైన రసాయనాలు చల్లబడి పైకి తేలి భూమి ఏర్పడిందని, ఇందుకు కొన్ని వందల బిలియన్‌ సంవత్సరాలు పట్టి ఉండొ చ్చన్నది శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని ప్రత్యేక పోషకాలు సముద్ర నీటిలోకి చేరి ఆ నీటి నుంచి ఆక్సిజన్‌ తయారైందని, ఉపవాయువు పెరుగుదల దాదాపు 250 కోట్ల సంవత్సరాల కిందట ప్రారంభమైందని, ఆ తరువాత బీచ్, నివాసయోగ్యమైన భూమి ఏర్పడిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అక్కడి తీరంలో ఉన్న నదీమార్గాలు, ఇసుకరాళ్లను విశ్లేషించిన అనంతరం ఈ అభిప్రాయానికొచ్చినట్లు తెలిపారు. అయితే ఎంత భూ భాగం ఏర్పడింది, ఇవి ఎంతకాలం అలా నీటిపై తేలుతూ ఉన్నాయన్నది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. కాగా.. ఇక్కడ గుర్తించిన ప్రత్యేకమైన అవక్షేప శిలలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు, వాటిలో ఉన్న యురేనియం, లెడ్‌ కంటెంట్‌ను బట్టి .. ఆ రాళ్లు 310 కోట్ల సంవత్సరాల కిందటివని తెలిపారు.

Read Also:  కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం జ్వాలా తోరణం.. దర్శనం చేసుకుంటే ఫలితం ఏమిటంటే..