Most Polluted City: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏదో తెలుసా.. ఢిల్లీ కాదండోయ్..
ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంది. అక్కడ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మనం ఢిల్లీ అత్యంత కాలుష్యం గల నగరమని అనుకుంటాం. కానీ...
ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంది. అక్కడ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మనం ఢిల్లీ అత్యంత కాలుష్యం గల నగరమని అనుకుంటాం. కానీ ఢిల్లీని మించిన నగరం ఒకటి ఉంది. అది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. పాకిస్తాన్‌లోని లాహోర్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా గుర్తించారు. గాలి నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ బుధవారం ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. లాహోర్‌లో వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని, ఐక్యూ 300 కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. కాలుష్యంతో భారీగా పొగమంచు కమ్ముకుంటుంది. పొగమంచు కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఐక్యూఎయిర్ పేర్కొంది. కాలుష్య తీవ్రతను లెక్కించి 348 వ ర్యాంకును ఇచ్చింది.
నాణ్యత లేని ఇంధనాలను మండించడం, పంట వ్యర్థాల దహనం, శీతకాల ఉష్ణోగ్రతలు మూలానా గత కొద్ది సంవత్సరాలుగా పాక్‌లో గాలి కాలుష్యం తీవ్రరూపం దాల్చుతోంది. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన లాహోర్ నగరం కాలుష్యపరంగా చెత్త నగరాల జాబితాలో కొనసాగుతోంది. దీంతో అక్కడి ప్రజలు సొంతంగా ఎయిర్ ప్యూరిఫైయర్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. కాలుష్య తీవ్రత పెరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ పరిస్థితికి భారత్ కారణమని అక్కడి సర్కారు ఆరోపిస్తుంది. స్థానిక ప్రజలు గాలి కాలుష్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నామని వాపోయారు.
గాలి గాలుష్యం కారణంగా స్థానికంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. కాలుష్యం వల్ల భారీగా పొగ మంచు కమ్ముకోవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. భారతదేశ సరిహద్దుకు సమీపంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్‌లో 11 మిలియన్లకు పైగా జనాభా ఉంది. అదే సమయంలో ఢిల్లీ గాలి నాణ్యతలో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉన్న నగరంగా ఢిల్లీ కొనసాగుతోంది.
Read Also.. First Beach: 330 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన బీచ్.. ప్రపంచంలోనే మొదటి బీచ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా..