Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Update: ఫేక్ న్యూస్‌కి ఇక గుడ్ బై.. ట్విట్టర్‌లో సరికొత్త మార్పులకు శ్రీకారం.. ఎలా గుర్తిస్తారంటే?

Twitter Warning Labels: తప్పుదారి పట్టించే కంటెంట్‌ను నిరోధించడానికి ట్విట్టర్ భారీ మార్పులు చేసింది. ఇందుకోసం వార్నింగ్ లేబుల్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే సమాచారంపై ఇక నుంచి..

Twitter Update: ఫేక్ న్యూస్‌కి ఇక గుడ్ బై.. ట్విట్టర్‌లో సరికొత్త మార్పులకు శ్రీకారం.. ఎలా గుర్తిస్తారంటే?
Micro Blogging Site Twitter
Venkata Chari
|

Updated on: Nov 18, 2021 | 6:57 PM

Share

Twitter Warning Labels: తప్పుదారి పట్టించే కంటెంట్‌ను నిరోధించడానికి ట్విట్టర్ భారీ మార్పులు చేసింది. ఇందుకోసం వార్నింగ్ లేబుల్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే సమాచారంపై ఇక నుంచి వార్నింగ్‌ లేబుల్‌ల స్థాయిని చూడనున్నారు. ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక లేబుల్‌ను విడుదల చేసింది. తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి ట్విట్టర్ నారింజ, ఎరుపు రంగులను వార్నింగ్ లేబుల్‌లను చేర్చింది. మొదటి స్థాయి రంగు నీలం రంగులో ఉండగా, ఇది ట్విట్టర్ రంగును పోలి ఉంటుంది.

కంటెంట్‌లో కచ్చితత్వం.. 2020 యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో ట్విట్టర్ (Twitter)లో తప్పుడు సమాచారం ప్రచారం అయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ చాలా కాలంగా దీనిపై కసరత్తులు చేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వినియోగదారులకు సరైన కంటెంట్‌ను అందించడంలో ఈ లేబుల్ సహాయం చేస్తుంది. దీంతో తప్పుడు సమాచారం, ఫోటోలు, వీడియోలు కూడా సులభంగా తొలగించనున్నారు.

కరోనాకు సంబంధించిన తప్పుడు డేటాతో పాటు తప్పుదారి పట్టించే సమాచారం కూడా ఈ లేబుల్స్ గుర్తించనున్నాయి. ఈ మేరకు ట్విట్టర్‌ తప్పుడు సమాచారాలపై మూడు రకాల వార్నింగ్ లేబుల్‌ను జారీ చేస్తుంది. ఇది వక్రీకరించిన కంటెంట్‌ను షేర్ చేస్తే వెంటనే, సంబంధిత లేబుల్‌ను జారీ చేస్తుంది. ఏదైనా తప్పుడు వీడియో/ఆడియోను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేయడం, ఎన్నికలకు సంబంధించిన తప్పుడు సమాచారాలను పంచుకుంటే వార్నింగ్ లేబుల్‌ను చూపిస్తుంది. దీంతో ఇక నుంచి ట్విట్టర్‌లో సరైన కంటెంట్‌ను పొందేందుకు ఆస్కారం ఉండనుంది.

Also Read: Most Used Passwords: ఇలాంటి పాస్‌వర్డ్‌లు పెడితే ‘ఫసక్’.. భారతీయులంతా అలాంటి పదాలనే వాడుతున్నారంట..!

Google Pay: గూగుల్‌పేలో మరో అదిరిపోయే కొత్త ఫీచర్‌.. మీ వాయిస్‌తో డబ్బులు ఖాతాకు బదిలీ..!