Google Pay: గూగుల్‌పేలో మరో అదిరిపోయే కొత్త ఫీచర్‌.. మీ వాయిస్‌తో డబ్బులు ఖాతాకు బదిలీ..!

Google Pay: డిజిటల్‌ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు గూగుల్‌ పే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు గూగుల్‌ పే హింగ్లిష్‌..

Google Pay: గూగుల్‌పేలో మరో అదిరిపోయే కొత్త ఫీచర్‌.. మీ వాయిస్‌తో డబ్బులు ఖాతాకు బదిలీ..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 18, 2021 | 5:44 PM

Google Pay: డిజిటల్‌ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు గూగుల్‌ పే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు గూగుల్‌ పే హింగ్లిష్‌, బిల్ స్ప్లిట్ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫీచర్‌ వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది గూగుల్‌. మీరు వాయిస్‌ ద్వారా మీ ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలనైనా సులభంగా చేయవచ్చు. త్వరలో ఈ సదుపాయం అందరికి అందుబాటులోకి రానుంది. యాప్‌ను యూజర్లకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు హింగ్లిష్‌ ఫీచర్‌ను జోడించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

బిల్ స్ప్లిట్ ఫీచర్‌ జోడించింది: ఇటీవల కంపెనీ గూగుల్‌ పే యాప్‌లో బిల్ స్ప్లిట్ ఫీచర్‌ను ప్రారంభించింది. వచ్చే ఏడాది నుంచి ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గూగుల్‌ పే యాప్‌ సహాయంతో వార్షిక ప్రతిపాదికన 400 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరుగుతున్నాయి.

మైషాప్‌ ఫీచర్‌.. అంతేకాకుండా దుకాణదారులకు మరింత సహాయంగా గూగుల్‌పే మైషాప్‌ ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా ఒక వ్యాపారి తాను గూగుల్‌ ప్లాట్‌ఫామ్‌లో సులభంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ప్రస్తుతం దాదాపు 10 మిలియన్ల వ్యాపారులు గూగుల్‌పే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌పే వినియోగించే వ్యాపారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మై షాప్‌ సహాయంతో లావాదేవీల విషయంలో మరింత సులభంగా మారనుంది. ఈ ఫీచర్‌ చిన్నవ్యాపారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని, త్వరలో మైషాప్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్‌ పే చెబుతోంది. ఈ ఫీచర్‌ కూడా రాబోయే కొద్ది రోజుల్లో గూగుల్‌పే యాప్‌లో అందుబాటులోకి రానుంది.

అయితే భారతీయులకు ఈ హింగ్లిస్‌ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా హిందీ తెలిసి ఇంగ్లీష్‌తో ఇబ్బందిగా ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

Electric Vehicle: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.1699 కడితే చాలు టూవీలర్ మీ సొంతం..!

Best Smartphones: స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.? రూ. 30 వేల లోపు అదిరిపోయే ఫోన్లపై ఓ లుక్కేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!