Electric Vehicle: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.1699 కడితే చాలు టూవీలర్ మీ సొంతం..!

Electric Vehicle: ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద ద్విచక్ర వాహనం ఉంటుంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాహనాల తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ..

Electric Vehicle: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.1699 కడితే చాలు టూవీలర్ మీ సొంతం..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 18, 2021 | 5:13 PM

Electric Vehicle: ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద ద్విచక్ర వాహనం ఉంటుంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాహనాల తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ మరిన్ని వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక కొత్త టూవీలర్‌ వాహనం కొనుగోలు చేసేవారికి ఓ శుభవార్త అందిస్తోంది కోయంబత్తూరుకు చెందిన బూమ్‌ మోటార్స్‌. తన కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లో విడుదల చేసింది. బూమ్ కార్బెట్ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ వాహనాన్ని రెండు వేరియంట్లలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది.

కార్బెట్‌ 14, కార్బెట్‌ 13 ఈఎక్స్‌ అని రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇక కార్బెట్ 14లో 2.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, కార్బెట్ 14ఈఎక్స్‌లో 4.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చించి కంపెనీ. కార్బెట్ 14 వేరియంట్ ఒక్కసారి చార్జ్‌ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే కార్బెట్ 14ఈఎక్స్ టూవీలర్ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. వీటి ధర వరుసగా రూ.89,999, రూ.124,999. ఇందుకు సంబంధించిన వాహనాల బుకింగ్‌ కూడా ప్రారంభమైంది.

చార్జింగ్‌ సమయం ఎంత..? ఈ రెండు వేరియంట్లకు చార్జింగ్‌ అయ్యేందుకు 2.5 నుంచి 4 గంటల్లో చార్జ్‌ అవుతాయి. ఇక స్పీడు విషయానికొస్తే గరిష్టంగా 75 కిలోమీటర్లు. ఈ వాహనాన్ని ఈఎంఐ రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. నెలకు ఈఎంఐ రూ.1699 నుంచి ప్రారంభం అవుతుంది. ఐదు సంవత్సరాల పాటు ఈఎంఐ సదుపాయం పొందవచ్చు.

ఇ-స్కూటర్స్‌ ఏడేళ్ల వారంటీతో లభించనున్నాయి. ఇంకో విషయం ఏంటంటే స్కూటర్‌ జీవిత కాలం ముగిసిన తర్వాత బ్యాటరీలు బూమ్‌ మోటార్స్‌ తిరిగి కొనుగోలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి:

SBI Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. నాలుగు క్లిక్స్‌తో వ్యక్తిగత రుణాలు.. వెంటనే అకౌంట్లోకి డబ్బులు..!

Jeevan Pramaan: పెన్షనర్లు అలర్ట్‌.. ఈనెల 30లోపు ఈ సర్టిఫికేట్‌ సమర్పించాలి.. లేకపోతే డబ్బులు రావు..!