Jeevan Pramaan: పెన్షనర్లు అలర్ట్‌.. ఈనెల 30లోపు ఈ సర్టిఫికేట్‌ సమర్పించాలి.. లేకపోతే డబ్బులు రావు..!

Life Certificate: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జీవించే ఉన్నామని రుజువుగా బ్యాంకులు..

Jeevan Pramaan: పెన్షనర్లు అలర్ట్‌.. ఈనెల 30లోపు ఈ సర్టిఫికేట్‌ సమర్పించాలి.. లేకపోతే డబ్బులు రావు..!
Follow us

|

Updated on: Nov 16, 2021 | 2:39 PM

Life Certificate: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జీవించే ఉన్నామని రుజువుగా బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీలకు లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి. ప్రతినెలా పెన్షన్‌ను పొందాలంటే ఈ సర్టిఫికేట్‌ అందించడం తప్పనిసరి అయితే ఈ ఏడాది పింఛనుదారులు తమ జీవన్ ప్రమాణ్‌ను నవంబర్ 30 లోపు సమర్పించాలి. దీంతో వృద్ధులు కేంద్ర ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లలో కూడా లైఫ్ సర్టిఫికెట్సమర్పించే వెసులుబాటు ఉంది. వృద్ధులు కార్యాలయాలకు వెళ్లి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని రూపొందించుకుని సబ్మిట్ చేయడం చాలా కష్టతరంగా మారింది.

ప్రస్తుత కరోనా కాలంలో బయటికి రావడం వారి ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే ప్రమాణపత్రం జనరేట్ చేసుకొని సమర్పించడానికి వెసులుబాటు కల్పిస్తోంది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, జీవన్ ప్రమాణ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే లైఫ్ సర్టిఫికెట్ రూపొందించవచ్చు. తర్వాత పెన్షన్ మంజూరు చేసే సంస్థలు తమకు కావాల్సినప్పుడు వాటిని యాక్సెస్ చేయగలవు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఆన్‌లైన్‌ స్టోర్ అవుతుంది. మరి ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్ ఎలా సమర్పించాలో తెలుసుకోండి.

జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.. పెన్షనర్‌ తప్పకుండా చెల్లుబాటు అయ్యే ఆధార్‌ నెంబర్‌ కలిగి ఉండాలి. ఆన్‌లైన్ సర్టిఫికేట్‌ను రూపొందించాలనుకునే పెన్షనర్ తప్పనిసరిగా పని చేసే మొబైల్ నెంబర్‌ను ఉండటం తప్పనిసరి. అన్నిటికంటే ముందుగా పెన్షనర్ ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో ఇలా సబ్‌మిట్‌ చేయండి ► పెన్షనర్ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో జీవన్ ప్రమాణ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

► తర్వాత పెన్షనర్ తన ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, పేరు, మొబైల్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) ఇలా పూర్తి వివరాలు నమోదు చేయాలి.

► సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఓటీపీ వచ్చాక ఆ నెంబర్‌ను కాపీ చేసి నమోదు చేయాలి. తరువాత ప్రమాణ్ ఐడీ జనరేట్ అవుతుంది.

► ఒకవేళ మీరు ఇప్పటికే ప్రమాణ్ ఐడీ క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు పై స్టెప్స్ ఫాలో కాకుండా నేరుగా యాప్‌లో లాగిన్ కావచ్చు. ఇందుకు ఒకసారి ఓటీపీ ధృవీకరిస్తే సరిపోతుంది.

► లాగిన్ అయ్యాక ‘జనరేట్ జీవన్ ప్రమాణ్ (Generate Jeevan Pramaan)’ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆధార్, మొబైల్ నంబర్‌లను నమోదు చేయాలి.

► ఇప్పుడు జనరేట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేసి దానిని నమోదు చేయాల్సి ఉంటుంది.

► పీపీఓ నెంబర్, పేరు, పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీ పేరును నమోదు చేయాలి. ఆధార్ డేటాను ఉపయోగించి, పెన్షనర్ వేలిముద్ర, ఐరిష్‌ను స్కాన్ ద్వారా స్వయం ధృవీకరణ చేయాలి.

► ధృవీకరణ పూర్తయిన తర్వాత జీవన్ ప్రమాణ్ ప్రింట్ కాపీ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దాని డిజిటల్ ప్రింట్ మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లైఫ్ సర్టిఫికెట్ కాపీ కనిపించిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అంతే, ఇక లైఫ్ సర్టిఫికెట్ విజయవంతంగా జనరేట్ చేసి సబ్మిట్ చేసినట్లవుతుంది. ఈ విధానాల ద్వారా పెన్షనర్లు ఆన్‌లైన్‌లో జీవన్‌ ప్రమాణ్ సర్టిఫికెట్‌ను సబ్‌మిట్‌ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

RBI Hackathon: ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌.. ఇందులో విజేతగా నిలిస్తే రూ.40 లక్షలు.. పూర్తి వివరాలు..!

RBI: రుణాలు ఇచ్చే ముందు ఇవి తప్పనిసరి.. బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం.. నిబంధనలు మరింత కఠినతరం..!

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!