Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Hackathon: ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌.. ఇందులో విజేతగా నిలిస్తే రూ.40 లక్షలు.. పూర్తి వివరాలు..!

RBI Hackathon: డిజిటల్‌ చెల్లింపులను మరింత సురక్షితంగా, వినియోగదారులకు సౌకర్యవంతంగా చేసే లక్ష్యంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తన మొదటి గ్లోబల్‌ హ్యాకథాన్‌ను..

RBI Hackathon: ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌.. ఇందులో విజేతగా నిలిస్తే రూ.40 లక్షలు.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 15, 2021 | 8:10 PM

RBI Hackathon: డిజిటల్‌ చెల్లింపులను మరింత సురక్షితంగా, వినియోగదారులకు సౌకర్యవంతంగా చేసే లక్ష్యంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తన మొదటి గ్లోబల్‌ హ్యాకథాన్‌ను నిర్వహించబోతోంది. ఈ హ్యాకథాన్‌ను ప్రకటించిన ఆర్బీఐ.. డిజిటల్‌ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, డిజిటల్‌ చెల్లింపులను ఉపయోగించని వారికి ఈ పేమెంట్స్‌ విధానం మరింత చేరువ చేసేందుకు తగిన పరిష్కార మార్గాలను సూచించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘HARBINGER 2021’ పేరుతో ఈ హ్యాకథాన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 15 నుండి ప్రారంభమైంది. ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేటప్పుడు అట్టడుగున ఉన్నవారికి డిజిటల్‌ చెల్లింపులను యాక్సెస్‌ చేసేలా, చెల్లింపుల విధానాన్ని మరింత మెరుగుపర్చడంతో పాటు సురక్షిత చేయడానికి సంబంధిత అంశాలను గుర్తించాలని ఆర్బీఐ తెలిపింది.

మొదటి బహుమతి రూ.40 లక్షలు: ఈ హ్యాకథాన్‌ కార్యక్రమం ద్వారా పరిష్కార మార్గాలను తెలిపినట్లయితే విజేతకు రూ.40 లక్షల బహుమతి అందించనున్నారు. రెండో బహుమతి గెలుపొందిన వారికి రూ.20 లక్షల నగదును అందజేయనున్నారు. ఆసక్తిగల వారు https://hackolosseum.apixplatform.com/hackathon/harbinger2021 లింక్‌పై క్లిక్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

ఇంతకుముందు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు కరెంటు ఖాతాలకు సంబంధించిన తన నిబంధనలను సడలించింది. ఆర్బీఐ జారీ చేసిన సర్క్యూలర్‌ ప్రకారం.. 50 మిలియన్ల కంటే తక్కువ ఎక్స్పోజర్‌ ఉన్న రుణ గ్రహితలు ఎటువంటి అడ్డంకులు లేకుండా కరెంటు ఖాతా, నగదు క్రెడిట్‌ ఖాతా, ఓవర్‌ డ్రాఫ్‌ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. అటువంటి రుణ గ్రహీతలు రూ. 5 కోట్ల పరిమితి దాటితే వారు బ్యాంకులు తెలియజేయాల్సి ఉంటుంది. దీనిపై ఆగస్టు 2020లో ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ గడువు అక్టోబర్‌ 31తో ముగిసింది. దానిని నెల పాటు అంటే నవంబర్‌ 30 వరకు పొడిగించింది.

ఇవి కూడా చదవండి:

RBI: రుణాలు ఇచ్చే ముందు ఇవి తప్పనిసరి.. బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం.. నిబంధనలు మరింత కఠినతరం..!

PF UAN Number: మీరు ఈపీఎఫ్‌ఓ యూఏఎన్‌ నంబర్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి..!