Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.1.19 లక్షల కోట్ల రీఫండ్‌..!

Income Tax: ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును..

Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.1.19 లక్షల కోట్ల రీఫండ్‌..!
Follow us

|

Updated on: Nov 18, 2021 | 3:38 PM

Income Tax: ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పిట వరకు పన్ను చెల్లింపుదారులకు 1లక్షా 19 వేల 93 కోట్ల రూపాయల రీఫండ్‌ను చేసింది. 1.02 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఈ రీఫండ్‌ చేసినట్లు సీబీడీటీ తెలిపింది. సీబీడీటీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 1,2021, నవంబర్‌ 15,2021 మధ్య ఆదాయపు పన్ను శాఖ 1,00,42,619 కేసుల్లో రూ.38,034 కోట్ల రీఫండ్‌ చేసినట్లు తెలిపింది. ఇది కాకుండా రూ.1,80,407 కార్పొరేట్‌ కేసులలో రూ.81.059 కోట్లను రీఫండ్‌ చేసినట్లు తెలిపింది. ఈ రీఫండ్‌లో 2021-22అసెస్‌మెంట్‌ సంవత్సరానికి రూ.67.99 లక్షల రీఫండ్‌ ఉంది. 2021-22 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ.13వేల 141 కోట్ల రీఫండ్‌ జారీ చేసినట్లు పేర్కొంది.

కాగా, దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలుపై పన్ను చెల్లింపుదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆలస్య రుసుమును వసూలు చేసింది. అయితే కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో జరిగిన చిన్న తప్పిదం కారణంగా ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్కార్‌ ఈ తప్పును సరిచేసింది. ఈ నేపథ్యంలోనే పన్ను చెల్లింపుదారులకు వారి నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఖాతాదారులకు రీఫండ్‌ చేసింది.

రీఫండ్ చెక్ చేసుకోవడం ఎలా.?

-ముందుగా ఐటీ డిపార్ట్‌మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో(E Filling Portal) లాగిన్ కావాలి.

– ఆ తరువాత రిటర్న్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.

– తరువాత మై అకౌంట్‌ ట్యాబ్‌కు వెళ్లి.. ఐటీ రిటర్న్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.

– తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌పై క్లిక్ చేయాలి.

– ఆదాయపు పన్ను రిఫండ్ స్టేటస్‌తో(IT Refund Status) పాటు రిటర్న్ వివరాలు పేజీపై తెరపై కనిపిస్తాయి.పన్ను చెల్లింపుదారు రిఫండ్ డబ్బును నేరుగా వారి ఖాతాకే క్రెడిట్ చేస్తారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..