Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా… థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్…

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. వీలైనంత త్వరగా తన చిత్రాలను పూర్తిచేసి.. కొత్త సినిమాలను

Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా... థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్...
Suirya
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2021 | 9:06 PM

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. వీలైనంత త్వరగా తన చిత్రాలను పూర్తిచేసి.. కొత్త సినిమాలను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేశాడు చిరు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చిరు సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు మరో స్టార్ హీరో పోటీ ఇవ్వబోతున్నాడు.

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం నటిస్తున్న ఎదుర్కుమ్ తునిందవన్ మూవీ.. చిరు సినిమాకు పోటీ ఇవ్వబోతుంది. ఇప్పటివరకు సూర్య నటించిన రెండు చిత్రాలు ఓటీటీలోనే విడుదలకాగా… ఈ సినిమాను మాత్రం థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. హీరో సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ ప్రేక్షకులు సూర్యకు వీరాభిమానులు. ఇటీవల జైభీమ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సూర్య.. ప్రశంసలు అందుకున్నాడు. అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ మూవీ హిట్ కావడమే కాకుండా.. సూర్య నటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక మొత్తానికి ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Also Read: Rashi Khanna: రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్..  పరుగుల జీవితం నుంచి  అంటూ.. 

Bigg Boss 5 Telugu: ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇస్తున్న ఆ ఇద్దరు.. డెస్టినీ వాళ్లను కలిపిందంటున్న నెటిజన్స్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!