AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Climbing Stairs: ఇదొక్కటి చేయండి చాలు.. రోగాలు మీ దరి చేరవు! వాకింగ్, జాగింగ్ కన్నా అధిక ప్రయోజనాలు..

మీరు సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ గుండె పది కాలాల  పాటు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నారా? షుగర్, బీపీ నియంత్రణలో ఉంచుకోవాలనుకొంటున్నారా? అయితే రోజూ మెట్లు ఎక్కండి చాలు.

Climbing Stairs: ఇదొక్కటి చేయండి చాలు.. రోగాలు మీ దరి చేరవు! వాకింగ్, జాగింగ్ కన్నా అధిక ప్రయోజనాలు..
Health Benefits Of Climbing Stairs
Madhu
|

Updated on: Mar 13, 2023 | 12:00 PM

Share

శరీరానికి శ్రమ లేకపోతే అనారోగ్యాలు చుట్టుముడతాయి. అందుకే రోజూ వ్యాయామం ఆరోగ్య దాయకం. అందు కోసం మీరు ఎక్కువ బరువులు ఎత్తాల్సిన పనిలేదు. వాకింగ్, జాగింగ్ వంటివి సులువైన పద్ధతులు పాటించినా చాలు. అయితే వీటన్నంటికంటే కూడా అత్యంత ఆరోగ్యదాయకమైన పద్ధతి ఒకటి ఉంది. అది ఒక్కటి చేస్తే చాలు మీ షుగర్ కంట్రోల్ అయిపోతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సులభంగా బరువు తగ్గిపోతారు. ఇంతకీ ఏంటి ఆ టెక్నిక్ అని ఆలోచిస్తున్నారా? ఏమి లేదంటే రోజూ మెట్లు ఎక్కడమే! రోజు నడవడం, లేదా పరుగెత్తడం కన్నా కూడా మెట్లు ఎక్కితే చాలా మీరు పూర్తి వ్యాయామం చేసినట్లే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అసలు మెట్లు ఎవరు ఎక్కాలి? దాని వల్ల ప్రయోజనాలు ఏంటి? ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయా? ఎవరు మెట్లు ఎక్కకూడదు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మెట్లు ఎక్కడం అంటే..

ప్రస్తుతం మెట్లు ఎక్కడం అనేది అందరూ గుర్తిస్తున్న మంచి వ్యాయామం. ఇది దినచర్యలో భాగమైనప్పటికీ దీనిని ఒక వ్యాయామ సాధనంగా ఉపయోగించుకోవచ్చని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన జిమ్ పరికరాలను కొనుగోలు చేసే పనిలేకుండానే రోజు మెట్లు ఎక్కి దిగటం వంటివి చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బరువును సులభంగా తగ్గించే మార్గాల్లో నడక కన్నా మెట్లు ఎక్కవటం వల్ల ఎక్కవ ప్రయోజనం పొందవచ్చు. మెట్లు ఎక్కటం అన్నది ప్రారంభించిన తొలినాళ్లల్లో చాలా కష్టంగా అనిపించినప్పటికీ తరువాత అది అలవాటుగా మారిపోతుంది. మెట్లు ఎక్కడం ప్రారంభించిన తొలిరోజుల్లో మోకాలి కీళ్ల నొప్పులు పుడతాయి. స్థూలకాయులకు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయితే క్రమం తప్పకుండా చేస్తే నడక కంటే మెట్లు ఎక్కవటం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి.

వారానికి 150 నిమిషాలు..

ప్రతిరోజూ 20-30 నిమిషాలపాటు శారీరక వ్యాయామం చేయటం అవసరమని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం వారానికి 150 నిమిషాల సాధారణ వ్యాయామం, 75 నిమిషాల ఎక్కువ శ్రమ గలిగిన వ్యాయామం చేయాలి. అప్పుడు శరీర బరువు అదుపులో ఉంటుంది. అయితే ఇంతటి వ్యాయామం కన్నా మెట్లు ఎక్కడం, దిగడం చేయడం ద్వారా ఎక్కువ కేలరీలు ఖర్చు చేయవచ్చు. 10 మెట్లు ఎక్కితే 1 క్యాలరీని బర్న్ అవుతుంది. ఇది ఒకరకంగా స్లో జాగింగ్ కంటే చాలా ఎక్కువ. మెట్లు దిగడం వల్ల కూడా 20 మెట్లకు 1 క్యాలరీ ఖర్చవుతుంది. మెట్లు ఎక్కడం కాస్త కష్టంతో కూడుకున్నదైనప్పటికీ ఈ రకమైన వ్యాయామాలు దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాల్లో తేలింది.

ఇవి కూడా చదవండి

ప్రయోజనాలు ఇవి..

మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని దిగువ కండరాలు దృఢంగా మారతాయి. కాలి కండరాలను బలోపేత కావటంతోపాటు, ఎక్కువ కేలరీలను బర్న్ అవుతాయి. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. ఒక వారంలో కనీసం 20 మెట్లు ఎక్కిన పురుషులు గుండె ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మెట్లు ఎక్కిదిగటం వల్ల శ్వాసపక్రియ మెరుగవుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది.

వీరు చేయకూడదు..

గుండె,ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు ఈ వ్యాయామాన్ని ప్రయత్నించే ముందు వైద్యుని సంప్రదించటం మంచిది. వైద్యుల సూచనలు సలహా తీసుకున్న తరువాతనే మెట్లు ఎక్కడం ప్రారంభించాలి. మెట్లు ఎక్కేటప్పుడు ఛాతీలో నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని గమనించినట్లయితే, వెంటనే ఆపి విశ్రాంతి తీసుకోండి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us