E-Cigarettes Effects: బ్యాన్ చేసినా వదల్లేకపోతున్నారా? అయితే మీరు లోకాన్ని వదిలేస్తారు..
క్రమేపి పెరుగుతున్న పరిశోధనల్లో సాధారణ సిగరెట్లు చేసే నష్టం కంటే ఈ-సిగరెట్లు చేసే నష్టం చాలా ఎక్కువని నిపుణులు తేల్చారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ-సిగరెట్లపై నిషేధం విధించింది. ఇప్పటికే ఈ-సిగరెట్లకు అలవాటు పడిన వారు వాటి వదల్లేక ఏదో రకంగా వాటిని తాగేందుకు ఇష్టపడుతున్నారు.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ మనం సినిమా హాల్లోకి వెళ్తే మొదటగా కనిపించే యాడ్.. అయితే సిగరెట్ల వాడకాన్ని తగ్గించేందుకు మొదట్లో ఈ-సిగరెట్లను అలవాటు చేసుకున్నారు. ప్రారంభంలో ఈ-సిగరెట్ల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే ప్రచారంతో చాలా మంది వాటి వైపు మొగ్గు చూపారు. అయితే క్రమేపి పెరుగుతున్న పరిశోధనల్లో సాధారణ సిగరెట్లు చేసే నష్టం కంటే ఈ-సిగరెట్లు చేసే నష్టం చాలా ఎక్కువని నిపుణులు తేల్చారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ-సిగరెట్లపై నిషేధం విధించింది. ఇప్పటికే ఈ-సిగరెట్లకు అలవాటు పడిన వారు వాటి వదల్లేక ఏదో రకంగా వాటిని తాగేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఓ తాజా పరిశోధన సైతం ఈ-సిగరెట్లు సాధారణ సిగరెట్ల కంటే ఎక్కువగా నష్టం చేస్తాయని నిపుణులు తేల్చారు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఈ-సిగరెట్లు ఎక్కువ నష్టం చేస్తాయని పేర్కొంటున్నారు. పీఈటీ ఇమేజింగ్‌ను వాడి ఉపయోగించి చేసిన తాజా పరిశోధనల్లో ఈ మేరకు తేలింది. ప్రస్తుతం భారత్‌లో వీటిని నిషేధించినా యూఎస్ మార్కెట్లో ఇవి విరివిగా దొరుకుతున్నాయి. యూఎస్‌లో ఉన్న యువతలో ప్రతి పది మందిలో ఒకరు ఈ ఈ-సిగరెట్లను తాగుతున్నారని అంచనా వేస్తున్నారు.
ఊపరితిత్తులకు వాపు
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చేసిన అధ్యయనంలో పీఈటీ ఇమేజింగ్ ఉపయోగించి చేసిన పరీక్షల్లో ఈ-సిగరెట్లు తాగే వారిలో అధిక వాపును గమనించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ లేదా ఐనోస్ అనే ఎంజైమ్ వీరిలో అధికంగా ఉండడంతో ఊపరితిత్తులు వాపునకు గురువతున్నట్లు గుర్తించారు. అలాగే ఇది పరిస్థితి ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) ఉన్న వ్యక్తులకు మరింత నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ-సిగరెట్ తాగేవారిలో ముఖ్యంగా ఊపిరితిత్తులలో మంట ఎక్కువగా ఉంటుందని, ధూమపానం చేయని వారి కంటే, సాధారణ సిగరెట్‌లు తాగే వారి కంటే కూడా అధ్వానంగా ఉంటుందని తేలింది. ఐదుగురు ఈ-సిగరెట్ వినియోగదారులు, ఐదుగురు సిగరెట్ తాగేవారు, సిగరెట్లు లేదా ఈ-సిగరెట్లు తాగని ఐదుగురు వ్యక్తులపై చేసిన పరిశోధనల్లో తాజా వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా ఈ-సిగరెంట్ ఆవిరి మేఘాలను సృష్టించడానికి ఉపయోగించే రసాయనాల యొక్క వివిధ సాంద్రతలను కలిగి ఉంటుంది. దీంతో రోగనిరోధక కణాలపై ఈ-సిగరెట్ ఆవిరి యొక్క ప్రభావాల వల్ల ఊపిరితిత్తులలో మంటకు దారితీస్తాయని అధ్యయనంలో తేలింది. పొగాకు సిగరెట్ తాగేవారి కంటే వీరిలో ఎక్కువ స్థాయిలో మంట ఉంటుంది. ఈ అధ్యయనంలో చూపిన స్వల్పకాలిక ప్రమాద సంకేతాల ఆధారంగా ఈ-సిగరెట్ ధూమపానం దీర్ఘకాలంలో మానవుల ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు.
సమస్యలు ఇవీ
ఈ-సిగరెట్ల వల్ల క్యాన్సర్ రోగులకు ఇచ్చే కొన్ని చికిత్సలు సరిగ్గా పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం మానేయడానికి చాలా మంది ఈ-సిగరెట్లను వాడుతున్నారు. అయితే ఈ-సిగరెట్ల వల్ల ఆయా వ్యాధులు రాకపోయినప్పటికీ సరికొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంతగా పొగాకు సిగరెట్లతో పాటు ఈ-సిగరెట్లకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..