E-cigarettes: ధూమపానం అలవాటు మానలేక ‘ఈ సిగరెట్’ వైపు చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్.. ఏమిటంటే..
E-cigarettes: సాంప్రదాయ ధూమపానంలో ఉండే నికోటిన్ ఆరోగ్యానికి హానికరమని.. ప్రత్యామ్నాయంగా ఈ సిగరెట్ మార్కెట్ లోకి వచ్చింది. ఇది సురక్షితమైన..
E-cigarettes: సాంప్రదాయ ధూమపానంలో ఉండే నికోటిన్ ఆరోగ్యానికి హానికరమని.. ప్రత్యామ్నాయంగా ఈ సిగరెట్ మార్కెట్ లోకి వచ్చింది. ఇది సురక్షితమైన ఎంపిక అంటూ యువతని ఆకర్షించింది. దీంతో సిగరెట్ అలవారు మానలేనివారు.. ఈ సిగరెట్ ను ఉపయోగిస్తున్నారు. ఇది చూడడానికి సిగరెట్ షేప్ లోనే ఉంటుంది. ఇక పొగాకు ఉండదు.. కానీ పొగాకులో ఉండే నికోటిన్ రుచిని తలపించేలా కొన్ని రసాయనాలు ఉంటాయి. దీంతో ఈ సిగరెట్ ను తాగితే.. నిజమైన సిగరెట్ ను తాగిన ఫీలింగ్ వస్తుందట. ఇందుకు గాను ఈ సిగరెట్ ను దాదాపు 2,000 రసాయనాలను ఉపయోగించి తయారు చేయసినట్లు తెలుస్తోంది.
జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ వారు ఈ సిగరెట్ పై జరిపిన పరిశోధనలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సిగరెట్ లో ఉన్న వాపింగ్ లిక్విడ్, ఏరోసోల్స్ లో పూర్తి స్థాయి రసాయనాలను వెతికేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అయితే సాధారణ సిగరెట్లలో ఉండే నికోటిన్ వంటివి పదార్ధాలు ఈ-సిగరెట్లలో చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ సిగరెట్ తయారీకి వాడిన రసాయనాల్లో ముఖ్యంగా ఆరు హానికరమైన పదార్థాలు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా స్టిమ్యులేటెడ్ కెఫీన్ ఉన్నట్టు తెలిసింది. ధూమపానం చేసేవారికి అదనపు కిక్ ఇవ్వడానికి ఈ-సిగరెట్ల తయారీదారులు కెఫీన్ ను కావాలనే జోడించినట్టు భావిస్తున్నరు పరిశోధకులు. ఇంకా మూడు పారిశ్రామిక రసాయనాలు, పురుగుమందులు, విషపూరిత ప్రభావం ఉన్న రసాయనాలు, శ్వాసకోశ ఇబ్బందిని కలిగించే రెండు సువాసనలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఆ విషయాన్ని తయారీదారులు బహిర్గతం చేయకుండా ఉద్దేశ పూర్వకంగానే దాస్తున్నారని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ-సిగరెట్లు సురక్షితం అని భావిస్తూ ఉపయోగిస్తున్నవారికి పరిశోధనలో వెల్లడైన విషయాలు చేదు మాత్రల్లా మారి నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆరోగ్యానికి హానికలిగించే ఏ సిగరెట్ అలవాటుకైనా మనిషి దూరంగా ఉండడం మంచిదని హెచ్చరిస్తున్నారు.
Also Read: ఈటెల బీజేపీని ఓన్ చేసుకోలేదు..బురదలో అడుగేసినావు అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్