Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By Election: ఈటెల బీజేపీని ఓన్ చేసుకోలేదు..బురదలో అడుగేసినావు అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్

Huzurabad By Election: హుజురాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు..

Huzurabad By Election: ఈటెల బీజేపీని ఓన్ చేసుకోలేదు..బురదలో అడుగేసినావు అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్
Minister Hareesh Rao
Follow us
Surya Kala

|

Updated on: Oct 16, 2021 | 9:08 PM

Huzurabad By Election: హుజురాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు.. బీజేపీ ప్రభుత్వంపై , ఈటెల పై సంచలన కామెంట్స్ చేశారు. ఈటెల రాజేందర్ ప్రచార సరళి, తాను వేరు, బీజేపీ వేరు అన్నట్లు సాగుతుందని సంచలన కామెంట్స్ చేశారు. ఈటెల ప్రవర్తనపై నిజమైన బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ ఎస్ కార్యకర్తలు బాధఫడుతున్నరు. రాజేందరన్న మీరు బీజేపీ అనే బురద గుంతలో దిగారు. బురద అంటకుండా ఉంటుందా అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు బీజేపీ వారు వారి ఫ్యూజులు వాళ్లే పీక్కోని కరెంట్ కట్ చేసుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. కాని విద్యుత్ శాఖ వాళ్లు శంకర్ నందరన్ ఫంక్షన్ హాలు వాళ్లు కరెంట్ బిల్లు కట్టలేదని విద్యుత్ కట్ చేశారని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలండర్ పై 291 రూ పన్ను వేస్తుంది..  దాన్ని తొలగించవచ్చు కదా అని ఇంటింటికి బీజేపీరాష్ట్ర నేతల మొదలు.. ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ లో అంబేద్కర్ వద్దకు వస్తాపదవికి రాజీనామా చేస్తా మీరుపోటీ నుంచి తప్పుకుంటా అని మాట్లాడి రెండు రోజులయింది. కాని ఇప్పటివరకు మాట్లాడలేదు. ఎందుకు స్పందించలేదు. నిజంగా రాష్ట్ర పన్ను291 రూ ఉందా. ఏడేళ్లు మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో జీఎస్టీవచ్చింది. సిలిండర్ పై పన్ను రాష్ట్ర ప్రభుత్వపరిధిలేదు. ఆరుసార్లు ఎమ్మెల్యే గా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా నేను రాజీనామాకు రెడీ అన్నా… రెండు రోజులయింది. మాట్లాడటం లేదు. ఈటలరాజేందర్ . ఇలాంటి అబద్దాలు, గోబెల్స్ ప్రచారం మీకు తెలుసు. మాకు తెలియదని హరీష్ రావు అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం పండుగ పూట వడ్డీలేని రుణం ఇస్తే, బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరపెంచిందని చెప్పారు. బట్ట కాల్చి మీద వేస్తామని అంటే విశ్వసనీయత ఉంటుందా.. మేం మద్యం, మాంసం పంచామని, 20 వేలు ఇస్తున్నరు అని ప్రజలను మోసం చేస్తున్నరు. ఆరుసార్లు ప్రజలు మిమ్ముల్ని గెలిపిస్తే, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అంటే హుజూరాబాద్ ప్రజలు కించపరుస్తున్నరు. అబద్దాల పునాదుల మీద చేసే ప్రచారలను, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రచారాలు,కరపత్రాల రూపంలో చేసే విష ప్రచారాన్ని తిప్పికొట్టండి. టీఆర్ఎస్ చేసిందే చెప్పింది, చేసేదే చెప్పింది, మేం ఢిల్లీకి గుళాంలు కాదు. ప్రజలకే గుళాంలు బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గుళాం గీరీ చేయాల్సి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ గెలిస్తే….. హుజూరాబాద్ ప్రజలకు గుళాంగిరీ చేస్తాం. ఈటల ఫస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఘోరీ కడతా అంటరు. విలువలతో కూడిన రాజకీయమా.. మానవత్వం లేదు కేసీఆర్ అని అంటరు. కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా.. ప్రజాస్వామ్యంలో తమ పార్టీ చేసిన పనులు చెప్పుకోవాలి. లేదా ఎదుటిపార్టీ వైఫల్యాలు ఎత్తి చూపాలని సూచించారు. గ్యాస్ ధరలు బీజేపి ప్రభుత్వవిధాన నిర్ణయమా కాదా… కేంద్రం గ్యాస్ ధరలు పెంచదా దీనికి సమాధానం చెప్పాలి. ప్రజలపై ప న్నుల భారంవేసి నిద్రపోనీయడంలేదు. నిత్యావసర వస్తువులు పెరిగాయి. ప్రభుత్వ రంగం సంస్థలను, రైళ్లను, విమానాశ్రయాలు అమ్ముతున్నారు.. దీనిపై మీ స్పందన ఏమిటంటూ ప్రశ్నించారు హరీష్ రావు.

టీఆర్ఎస్ రైతులను కారెక్కించాలని అనుకుంటోంది. బీజేపీ రైతులపై కారెక్కిస్తుంది.  హుజూరాబాద్ అక్కా చెళ్లెల్లారా గ్యాస్ బండకు దండ పెట్టి టీఆరెస్ కు ఓటు వేసి.. బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించండి అంటూ పిలుపునిచ్చారు.  ప్రజాస్వామ్యంలో మంచి చర్చ జరగాలి. ఏడేళ్ల బీజేపీ పాలన- టీఆర్ఎస్ పాలనకు రిఫరెండంగా తీసుకుందాం. బీజేపీ ఏడే ళ్ల పాలన చూసి ఓటు వేయమని అడుగుదాం. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో ఏం చేసామో చెప్పి ఓటడుగుదాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి అబద్దాల ప్రచారం గోబెల్స్ ప్రచారం చేస్తరు. విషప్రచారాలు నమ్మవద్దని చెప్పారు మంత్రి హరీష్ రావు.

Also Read: రాగిపాత్రలు ఆరోగ్యానికి మంచివే.. అయితే ఈ ఆహారపదార్ధాలను నిల్వ చేసి తింటే.. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం..